
సినీ ఇండస్ట్రీలో అవార్డ్స్ ఫంక్షన్స్ వచ్చాయంటే చాలు స్టార్ హీరోలందరూ ఒక దగ్గర చేరి ఆడియన్స్ ను అలరిస్తూ ఉంటారు. కొంతమంది మాటలతో, కొంతమంది పాటలతో, మరికొంతమంది డాన్స్ చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ ఉంటారు. నిజానికీ స్టేజి మీద ఒక స్టార్ కనిపిస్తేనే ఒక రేంజ్ లో ఉంటది. అలాంటిది వేరే వేరే ఇండస్ట్రీలకి సంబందించిన ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒకే పాటకి మాస్ డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది. ఆ మాస్ ప్రెజెంటేషన్ పీక్స్ లో ఉంటుంది కదా.
సరిగ్గా అలంటి సిచువేషనే ఒకటి జరిగింది. శుక్రవారం రోజున చెన్నైలో గలాటా గోల్డెన్ స్టార్ అవార్డ్స్ వేడుకలు జరిగాయి. ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ వేడుకల్లో వేరే వేరే భాషల స్టార్స్ అటెండ్ అయ్యి ఆహుతులను అలరించారు. ఇందులో భాగంగా అవార్డు తీసుకోవడం కోసం తమిళ స్టార్ కార్తీ స్టేజ్ మీదకి రాగా.. ఆయనకు అవార్డు అందించేందుకు విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగాను పిలిచారు.
Hero @Karthi_Offl Dances with @TheDeverakonda In Galatta Golden Stars 2024. ❤️??#Karthi #VijayDeverakonda
— Suresh PRO (@SureshPRO_) March 29, 2024
pic.twitter.com/P3T1HURnQp
అవార్డు అందుకున్న అనంతరం కార్తీని, విజయ్ ని డాన్స్ చేయమని అడగగా.. ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మాస్ డాన్స్ చేశారు. కార్తీ సినిమాలోని ఒక పాటకు తీన్మార్ డాన్స్ వేసి స్టేజిపై రచ్చ రచ్చ చేశారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అన్నా ఇద్దరు కలిసి స్టేజీపై దుమ్ములేపారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.