జేసీబీ ప్రమాదంలో గాయపడ్డ శ్రీనివాసులుకు.. విజయ్ దేవరకొండ ఆర్ధిక సహాయం

జేసీబీ ప్రమాదంలో గాయపడ్డ శ్రీనివాసులుకు.. విజయ్ దేవరకొండ ఆర్ధిక సహాయం

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda) ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇటీవల ఆయన హీరోగా వచ్చిన ఖుషి(Kushi) మూవీ సక్సెస్ మీట్ లో తన అభిమానుల్లో 100 కుటుంబాలకు తలా లక్ష చొప్పున మొత్తం కోటి రూపాయలు పంచనున్నాని ప్రకటించారు. ఇందులో భాగంగా దాదాపు వారం రోజుల పాటు అప్లికేషన్ ప్రాసెస్ ను నిర్వహించారు. అందులో సెలెక్ట్ అయినా 100 మందికి సెప్టెంబర్ 14న చెక్కులు పంచారు విజయ్ దేవరకొండ.  

ఈ కార్యక్రమంలో నాగర్కర్నూల్ జిల్లా శ్రీపురం గ్రామనికి  చెందిన ఎరుకలి కర్నాకర్ కు కూడా లక్ష ఆర్థిక సహాయం అందిచారు. ఎరుకలి శ్రీనివాసులుకు కొంత కాలం క్రితం జేసీబీ బొల్తా పడిన ప్రమాదంలో పెద్ద ప్రేగుకు గాయం అయింది. అంతేకాదు తన కూడి కాలుకు కూడా శస్త్ర చికిత్స చేయాలని సూచించారట వైద్యులు.

అందుకు సరిపడా డబ్బులు తమ దగ్గర లేక పోవడంతో.. విజయ్ దేవర కొండ అభిమాన సంఘం అధ్యక్షుడు విష్ణు వర్ధన్ (VISHNU VARDHAN) సాలువది గారికి వారి సమస్య వివరించారు. సమస్య గుర్తుంచి జిల్లా తరపున ఖుషి (spreading to 100 family's) ఏంపిక చేయడం జరిగింది. దీంతో.. ఆనందం వ్యక్తం చేసిన శ్రీనివాసులు ఫ్యామిలీ విజయ్ దేవరకొండకు ధన్యవాదాలు తెలిపారు.