ఆగస్టు 25న లైగర్ రిలీజ్

ఆగస్టు 25న లైగర్ రిలీజ్

‘లైగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ సినిమా రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ముందే రెండు కొత్త సినిమాల్ని స్టార్ట్ చేసేశాడు విజయ్ దేవరకొండ. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఖుషి’ వాటిలో ఒకటి. సమంత హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థ నిర్మిస్తోంది. గత నెల 23న కశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షూటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టారు. అక్కడి అందమైన లొకేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని రీ సెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కంప్లీట్ చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు ట్విటర్ ద్వారా తెలియజేశాడు. తర్వాతి షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్లాన్ చేశారు. త్వరలోనే స్టార్ట్ చేయనున్నారు. ఆ తర్వాత వైజాగ్, అల్లెప్పీల్లో కొంత భాగం షూట్ చేయనున్నారు. జయరామ్, సచిన్ ఖేడ్కర్, మురళీశర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 23న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇక పూరి జగన్నాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విజయ్ నటించిన ‘లైగర్’ ఆగస్టు 25న విడుదల కానుంది. వీరిద్దరి కాంబినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ‘జనగణమన’ అనే మరో సినిమా రూపొందుతోంది.