శ్రీలంకలో.. విజయ్ దేవరకొండ కొత్త సినిమా షూటింగ్

శ్రీలంకలో.. విజయ్ దేవరకొండ కొత్త సినిమా షూటింగ్

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. వీటిలో ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌‌‌‌లో తెరకెక్కుతున్న చిత్రం ఒకటి. విజయ్ కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది 12వ చిత్రం. ఇందులో శ్రీలీల హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్‌‌‌‌కు సంబంధించి ఓ అప్‌‌‌‌డేట్ వచ్చింది. కీలక షెడ్యూల్‌‌‌‌ కోసం టీమ్ అంతా శ్రీలంక వెళ్లింది.  అక్కడ విజ‌‌‌‌య్‌‌‌‌కు ఘ‌‌‌‌న స్వాగ‌‌‌‌తం ల‌‌‌‌భించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నలభై రోజుల పాటు శ్రీలంకలోని పలు లొకేషన్స్‌‌‌‌లో కీలక సన్నివేశాలు తీయబోతున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే నలభై శాతం వరకూ చిత్రీకరణ జరిగింది. ఈ షెడ్యూల్‌‌‌‌తో షూటింగ్ చివరిదశకు చేరుకోనుంది.  హై ఓల్టేజీ కాప్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.   మలయాళ డీవోపీ  గిరీష్‌‌‌‌ గంగాధరన్‌‌‌‌  సినిమాటోగ్రాఫర్. సితార ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్నాయి.  దీంతో పాటు ‘టాక్సీవాలా’ ఫేం రాహుల్‌‌‌‌ సంకృత్యాన్ దర్శకత్వంలో ఓ సినిమా, ‘రాజావారు రాణిగారు’ ఫేం రవికిరణ్ కోలా డైరెక్షన్‌‌‌‌లో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ.