ఆస్కార్ ఎంట్రీస్ లిస్ట్‌లో డియర్ కామ్రేడ్

ఆస్కార్ ఎంట్రీస్ లిస్ట్‌లో డియర్ కామ్రేడ్

సెన్సేషనల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ నటించిన డియర్ కామ్రేడ్ మూవీ అరుదైన ఘనత సాధించింది. సినిమా సక్సెస్ కాకపోయినప్పటికీ… కంటెంట్, ఇంటెన్సిటీ అంశాల ఆధారంగా.. ఆస్కార్ ఎంట్రీ లిస్టులో చోటు దక్కించుకుంది. మైత్రీమూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ బ్యాన‌ర్స్ పై భ‌ర‌త్ క‌మ్మ దర్శకత్వంలో రూపొందింది డియర్ కామ్రేడ్.

ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా – FFI ఆధ్వర్యంలోని క‌మిటీ.. డియర్ కామ్రేడ్ ను విదేశీ కేటగిరీలో.. ఆస్కార్ ఎంట్రీ లిస్టులోకి ఎంపిక చేసింది. డియర్ కామ్రేడ్ తోపాటు… దేశంలోని పలు భాషల్లో రూపొందిన 28 సినిమాలు కూడా ఎంట్రీస్ లిస్టులో చోటు దక్కించుకున్నాయి. ఐతే… తెలుగు నుంచి ఆస్కార్ ఎంట్రీ జాబితాలో చేరిన సినిమా డియర్ కామ్రేడ్ ఒక్కటే.

ఈ సినిమాలన్నింటినీ ఫిలిం మేకర్ అపర్ణాసేనే ఆధ్వర్యంలోని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిటీ పరిశీలించి… బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ కేట‌గిరీలో ఆస్కార్‌ అవార్డుకు పంపుతుంది.