బిహార్ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా రాజీనామా

బిహార్ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా రాజీనామా

బిహార్ అసెంబ్లీ స్పీకర్ పదవికి  విజయ్ కుమార్ సిన్హా రాజీనామా చేశారు.  బలపరీక్షకు ముందే ఆయన తన రాజీనామాను సమర్పించారు. దీంతో సభను స్పీకర్  మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. 

సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని మహాఘట్బందన్‌ ప్రభుత్వం... విజయ్ కుమార్ సిన్హా పై ఇటీవల అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. తీర్మానం అస్పష్టంగా ఉందని, రాజీనామా చేసే ప్రసక్తే లేదని  సిన్హా కొద్దిరోజుల క్రితం తేల్చి చెప్పారు. 

అయితే  అవిశ్వాస తీర్మానంపై ఇవాళ అసెంబ్లీలో సిన్హా  ప్రసంగిస్తూ .. తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మరో వైపు జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్‌ కూటమితో కొత్తగా ఏర్పడిన  మహాఘట్ బందన్‌ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది.