
ఇండోర్: ‘నీ ఇల్లు బంగారం కాను’ అనే పాట వినే ఉంటారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఒక ప్రభుత్వ కాంట్రాక్టర్ ఆ మాటను నిజం చేశాడు. ఇంట్లో ఎటు చూసినా బంగారమే.. ఫర్నిచర్ నుంచి ఇంట్లోని డెకరేటివ్ వస్తువుల దాకా.. ఎలక్ట్రికల్ సాకెట్స్ నుంచి చివరకు వాష్ రాం ట్యాప్స్ కూడా బంగారంతోనే చేయించుకున్న ఈ ప్రభుత్వ కాంట్రాక్టర్ మ్యాన్షన్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
They also have the Gaushala at the entrance to bring divine blessings.
— Kapil (@kapsology) June 30, 2025
Does anyone know the name of this person or their company? pic.twitter.com/la3sO4htdS
కంటెంట్ క్రియేటర్ ప్రియం సరస్వత్ సదరు ప్రభుత్వ కాంట్రాక్టర్ అనుమతితో ఆ భవంతి మొత్తం వీడియో తీసి చూపించాడు. ‘‘బ్యూటిఫుల్ హౌస్.. డెకరేటెడ్ విత్ గోల్డ్ ఇన్ ఇండోర్, ఇండియా’’ అనే పేరుతో ఇన్ స్టాగ్రాంలో వీడియో అప్ లోడ్ చేశాడు.
ఈ వీడియోకు ఇప్పటిదాకా కోటీ 80 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయంటే ఎంతలా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియోకు 10 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఇక.. ఈ ఖరీదైన భవంతి యజమాని తన లగ్జరీ లైఫ్ స్టైల్ పై స్పందిస్తూ.. తమ కుటుంబంలో మొత్తం పాతిక మందికి పైగా ఉన్నామని.. గతంలో తమకు ఒక పెట్రోల్ బంక్ మాత్రమే ఉండేదని చెప్పాడు.
He is a government contractor from Indore.
— Kapil (@kapsology) June 30, 2025
Initially his 25 members family has a single petrol pump.
Then he moved into the business of government contracts.
He started making roads, bridges and building for govt.
Now even electrical switches in his home are of 24 ct gold. pic.twitter.com/SRJEuqUwa3
పాతిక మందికి పైగా ఉన్న తమ కుటుంబం ఆర్థికంగా ఎదగాలంటే ఇంకేదైనా వ్యాపారంలో దిగాలని తాను భావించానని, అప్పుడే గవర్నమెంట్ కాంట్రాక్ట్ షిప్ దక్కించుకున్నానని తెలిపాడు. ప్రభుత్వానికి రోడ్లు, బ్రిడ్జిలు, బిల్డింగ్స్ కట్టి ఇచ్చామని.. ప్రస్తుతం 300 రూమ్స్ ఉన్న హోటల్ నిర్మిస్తున్నామని.. ఇదే తన జర్నీ అని ఓనర్ చెప్పుకొచ్చాడు.
ALSO READ | అమెరికాలో టిక్టాక్ రీఎంట్రీ.. కొనేందుకు బయ్యర్లు దొరికారని ప్రకటించిన ట్రంప్
ఇక.. ఈ ధనవంతుడైన ప్రభుత్వ కాంట్రాక్టర్ మ్యాన్షన్ విషయానికొస్తే.. ఇంటి గేట్లు ఓపెన్ చేయగానే.. 1936 మోడల్ వింటేజ్ మెర్స్డెస్ కారు.. ఇంకొన్ని లగ్జరీ కార్లు కనిపించాయి. ఆ మ్యాన్షన్ బయట ఒక గోశాల ఉంది. పది బెడ్ రూమ్స్, ఇంట్లో ఎటు చూసినా గోల్డ్ కోటింగ్ గోడలు, డెకరేటివ్ గోల్డ్ ఐటమ్స్.. ఇలా ఎటు చూసినా బంగారమే కనిపిస్తుండే సరికి ఈ వీడియో చూసిన నెటిజన్లు కంగుతిన్నారు. సదరు ప్రభుత్వ కాంట్రాక్టర్పై ఐటీ రైడ్స్ చేయాలని కొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తుండటం గమనార్హం.