లిక్కర్ స్కాం : విజయ్ నాయర్ బెయిల్పై విచారణ వాయిదా

లిక్కర్ స్కాం : విజయ్ నాయర్ బెయిల్పై విచారణ వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జైలులో ఉన్న విజయ్ నాయర్ సీబీఐ స్పెషల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈడీ అతడిని కోర్టులో హాజరుపర్చింది. విజయ్ నాయర్ అమ్ అద్మి పార్టీ మీడియా కోఆర్డినేటర్ అని ఈడీ తరుపు న్యాయవాది కోర్టులో వాదించారు. లిక్కర్ పాలసీ తయారీ సహా అమలుచేయడంలో విజయ్ నాయర్ది ప్రధాన పాత్ర అన్నారు. లిక్కర్ పాలసీ తయారీలో ఆయన అనేక మంది రాజకీయ నాయకులను కలిశారని.. 100 కోట్ల ముడుపుల మార్పిడిలో విజయ్ నాయర్ ఉన్నాడని కోర్టుకు తెలిపారు.

సౌత్ గ్రూప్కి అరు శాతం లాభం చేకూర్చేలా లిక్కర్ పాలసీ ఉందని.. సౌత్ గ్రూప్తో విజయ్ నాయర్కి సంబంధాలు ఉన్నాయని ఈడీ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అరుణ్ పిళ్ళై ఇండో స్ప్రిట్కి లిక్కర్ హోల్సేల్లో 65 శాతం వాటా ఉందన్నారు. విజయ్ నాయర్ 3 నెలల్లో 7 ఫోన్లు మార్చాడని..  సిగ్నల్, టెలిగ్రాం ద్వారా ఛాటింగ్, వాయిస్ కాల్స్ జరిగాయని చెప్పారు. ఈ వాదనలు విన్న న్యాయస్థానం విచారణను జనవరి 20కి వాయిదా వేసింది. ఈ కేసులో మరో నిందితుడుగా ఉన్న సమీర్ మహేంద్ర బెయిల్ పిటిషన్ పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం విచారణను జనవరి 18కి వాయిదా వేసింది.