జవాన్‌‌తో జగడం

జవాన్‌‌తో జగడం

తన వెర్సటాలిటీతో తెలుగు, తమిళ, మలయాళ భాషల వారినే కాక బాలీవుడ్‌‌ వారిని కూడా ఇంప్రెస్‌‌ చేస్తున్నాడు విజయ్ సేతుపతి. అందుకే ప్రతి లాంగ్వేజ్‌‌లోనూ అతని కోసం అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఔట్‌‌ సైడర్స్‌‌ని అత్యంత తక్కువగా ఎంకరేజ్ చేసే బీటౌన్‌‌ వారు సేతుపతి కోసం రెడ్ కార్పెట్ పరవడం నిజంగా విశేషమే. ఇప్పటికే అక్కడ రెండు సినిమాలు, ఒక వెబ్ సిరీస్ చేస్తున్న సేతుపతి.. ఇప్పుడు మరో మూవీకి సెలెక్టయ్యాడు. అది కూడా మామూలు చిత్రం కాదు. షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్‌‌ మూవీ ‘జవాన్’. సౌత్‌‌ డైరెక్టర్ కాబట్టి సేతుపతి అతని చాయిస్ అయ్యుండొచ్చనుకుంటారంతా.

కానీ తన పేరుని ప్రపోజ్ చేసింది స్వయంగా షారుఖ్ అట. ఆ టీమ్‌‌లోని ఒకరి ద్వారా ఈ విషయం బైటికొచ్చింది. క్షణాల్లో వైరల్ అయ్యింది. నయనతార హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సేతుపతి మెయిన్‌‌ విలన్‌‌గా కనిపించబోతున్నాడు. నిజానికి ఈ పాత్ర రానా చేయాలి. కానీ పర్సనల్ రీజన్స్ వల్ల తను చేయలేకపోవడంతో సేతుపతిని సెలెక్ట్ చేశారట. మొత్తానికి తన నటనతో లాంగ్వేజ్ బ్యారియర్స్‌‌ని బద్దలు కొట్టేసి మరీ దూసుకుపోతున్నాడు సేతుపతి.