
హైదరాబాద్ : MRO విజయారెడ్డి సజీవ దహన ఘటనపై నిరసనగా మరో రెండు రోజులు బంద్ పాటిస్తామని రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు డిప్యూటీ కలెక్టర్ల సంఘం, తాసీల్దార్లు, వీఆర్వో, వీ ఆర్ ఏ, రెవెన్యూ సర్వీసెస్ తో కూడిన జేఏసీ బంద్ ప్రకటన చేసింది. ఈ దారుణానికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, విజయా రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని జేఏసీ కోరింది. ఈ ఘటనలో ఎమ్మార్వో ని కాపాడబోయి మృతి చెందిన డ్రైవర్ గురునాథం కుటుంబానికి తమ వంతు సాయంగా ఉద్యోగులంతా ఒకరోజు జీతాన్ని ఇవ్వనున్నట్టు జేఏసీ తెలిపింది. ప్రభుత్వం కూడా అతని కుటుంబానికి ఆర్ధిక సాయం చేయాలని కోరింది.