సిగ్నల్ ఫ్రీగా మారుస్తున్నం: మేయర్ విజయలక్ష్మి

సిగ్నల్ ఫ్రీగా మారుస్తున్నం:  మేయర్ విజయలక్ష్మి

ఉప్పల్, వెలుగు:  గ్రేటర్ సిటీలో సిగ్నల్ ఫ్రీ రవాణాను మెరుగు పరిచేందుకు రూ. 8 వేల కోట్ల అంచనాతో 48 పనులను చేపట్టి ఇప్పటివరకు 35 పనులను పూర్తి చేసినట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. కాప్రా సర్కిల్ మల్లాపూర్​లో  రూ.2 కోట్ల 43 లక్షలతో చేపట్టిన పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాశ్ రెడ్డి, మల్లాపూర్ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి లతో కలిసి మేయర్ గురువారం శంకుస్థాపన చేశారు. 

అనంతరం మేయర్ మాట్లాడుతూ ఎస్ఆర్డీపీ పనుల్లో ఇప్పటివరకు 35 పూర్తవగా.. అందులో 19 ఫ్లైఓవర్లు, 5 అండర్ పాస్, 7 ఆర్వోబీలు ఉన్నాయని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు నివారణకు ఎస్ఎన్​డీపీ ద్వారా రూ.733 కోట్లతో 35 పనులు చేపట్టగా ఇప్పటివరకు 30 పూర్తి చేశామని, మిగతావి తుది దశలో ఉన్నాయని వివరించారు. అనంతరం మేయర్ స్థానిక వార్డు ఆఫీసును తనిఖీ చేసి పరిష్కరించిన ఫిర్యాదులపై ఏవోను అడిగి తెలుసుకున్నారు. ఏఎస్ రావు నగర్కార్పొరేటర్ శిరీషా రెడ్డితో కలిసి అక్కడి నాలా నిర్మాణ పనులను పరిశీలించారు.