
ప్రముఖ నటి, డైరెక్టర్, నిర్మాత విజయనిర్మల 74వ జయంతి సందర్భంగా ఆమె కాంస్య విగ్రహాన్ని సూపర్ స్టార్ కృష్ణ ఆవిష్కరించారు. గురువారం హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో కృష్ణ, విజయనిర్మల నివాసం ఉన్న ఇంట్లోనే ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని నివాళులర్పించారు. కృష్ణ మాట్లాడుతూ విజయనిర్మల లేని లోటు తీర్చలేనిదని, ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. విజయనిర్మల స్త్రీ శక్తి పురస్కారాన్ని డైరెక్టర్ నందినిరెడ్డికి.. కృష్ణంరాజు, హీరో మహేశ్ బాబు అందించారు. నరేశ్ మాట్లాడుతూ ప్రతి తల్లి అమ్మవారితో సమానమని, అమ్మ దీవెనలు ఉన్న వారు గొప్ప విజయాలు సాధిస్తారని అన్నారు. అమ్మపేరిట అవార్డును ఏటా అందిస్తామన్నారు. పరుచూరి గోపాలకృష్ణ, మాజీ ఎంపీ మురళీమోహన్, డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి, నమ్రత, అచ్చిరెడ్డి, రేలంగి నరసింహారావు, గల్లా జయదేవ్, సుధీర్ బాబు,
ఆదిశేషగిరిరావు, శివకృష్ణ, మారుతి, బ్రహ్మాజీ, శివబాలాజీ కార్యక్రమానికి హాజరయ్యారు.