
బీజేపీలో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు చంద్రబాబు బినామీలే అన్నారు వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి. శనివారం ట్విట్టర్ లో ఆయన చంద్రబాబును టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్స్ చేశారు. తనపై అవినీతి కేసులు పెట్టకుండా రక్షణ కోసమే వారిని పంపించారన్నారు. తనకు తెలియకుండానే జరిగితే ఫిరాయించిన వారిని అనర్హులుగా ప్రకటించాల్సిందిగా రాజ్యసభ చైర్మన్‌కు లేఖ అయినా రాసి ఉండేవారు. ఇది 100% మ్యాచ్ ఫిక్సింగే అన్నారు.
చంద్రబాబు విహార యాత్రకు ఏ దేశం వెళ్లారో ఆ పార్టీ నాయకులకూ తెలియదని.. స్విట్జర్లాండ్ వెళ్లారో స్వీడన్‌లో ఉన్నారో చెప్పలేనంత రహస్యమా? ఎల్లో మీడియా కూడా యూరప్ నుంచి ముఖ్య నాయకులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారని రాసిందన్నారు. యూరప్ అనేది దేశం కాదు. 44 దేశాలున్న ఖండమని అందరికీ తెలుసన్నారు.
సొంత నిధులతో తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేసిందని.. 45 లక్షల ఎకరాలకు నీరందుతుంది. కేంద్రం నిధులిచ్చినా ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సగం కూడా నిర్మించలేక పోయారని తెలిపారు. చంద్రబాబుకు ఎంత సేపు నిధులను దోచుకోవడం తప్ప పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నసంకల్పమే లేదుని ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.
సొంత నిధులతో తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేసింది. 45 లక్షల ఎకరాలకు నీరందుతుంది. కేంద్రం నిధులిచ్చినా ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సగం కూడా నిర్మించలేక పోయారు. ఎంత సేపు నిధులను దోచుకోవడం తప్ప పూర్తి చేయాలన్నసంకల్పమే లేదు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 22, 2019