
హైదరాబాద్, వెలుగు: కరెంట్ బిల్లులు సోనియా గాంధీ ఇంటికి పంపిస్తే.. కాళేశ్వరం బిల్లులు కేసీఆర్ ఇంటికి పంపాలని విజయశాంతి అన్నారు. కరెంట్ బిల్లులపై కేటీఆర్ చేసిన కామెంట్లపై ట్విట్టర్లో ఆమె కౌంటర్ ఇచ్చారు. ‘‘కరెంట్ బిల్లులు సోనియా గాంధీకి పంపాలంటున్న కేటీఆర్.. కాళేశ్వరం దోపిడీ బిల్లులు కేసీఆర్ ఇంటికి పంపాలని చెప్పాలి. ఖజానా మొత్తం దోచుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల పాల్జేసింది. ఈ విషయం కేటీఆర్కు తెలుసు కాబట్టే.. కాంగ్రెస్ హామీలు అమలు కావని మాట్లాడు తున్నారు. కానీ కష్టమైనా సరే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతుంది’’ అని పేర్కొన్నారు.