
బీజేపీకి దూరమవుతారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు ఆపార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి. కొంతమంది నేతలు పనిగట్టుకుని తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ట్వీట్ చేశారు.
చిట్ చాట్ ల పేరుతో ఏదో ఒక వ్యూహంతో చేసే కార్యాచరణ నాకు అలవాటు లేదు...
— VIJAYASHANTHI (@vijayashanthi_m) September 21, 2023
పార్టీ కి ఏది ముఖ్యమో ఆ అంశాలను పార్టీ ప్రధాన నాయకులకు ఈ నెల 16 న ముఖ్య సమావేశంలో నేను స్పష్టంగా తెలియచేయడం జరిగింది.
ఆ విషయాలు బయటకు లీకేజ్ ల పేరుతో ఇయ్యడానికి నేను వ్యతిరేకిని...
ఇదంతా తెలిసి కూడా కొంతమంది… pic.twitter.com/JUGooRYvsL
చిట్ చాట్ ల పేరుతో ఏదో ఒక వ్యూహంతో చేసే కార్యాచరణ తనకు అలవాటు లేదని పేర్కొన్నారు. పార్టీకి ఏదీ ముఖ్యమో.. ఆ అంశాలను పార్టీ ప్రధాన నాయకులకు స్పష్టంగా చెప్పానని.. ఆ విషయాలు బయటకు లీక్ చేయడానికి తాను వ్యతిరేకమన్నారు.