జిల్లాలో తాగునీటి ఎద్దడి రానివొద్దు : కలెక్టర్​ నారాయణ రెడ్డి 

జిల్లాలో తాగునీటి ఎద్దడి రానివొద్దు : కలెక్టర్​ నారాయణ రెడ్డి 
  • వికారాబాద్​ కలెక్టర్​ నారాయణ రెడ్డి 

కొడంగల్​, వెలుగు : జిల్లాలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని మిషన్​భగీరథ అధికారులను వికారాబాద్​కలెక్టర్​ నారాయణ రెడ్డి ఆదేశించారు. బుధవారం కొడంగల్​లో  కలెక్టర్​ సమీక్ష చేశారు. ప్రజలు తాగు నీటికి ఇబ్బందులు పడకుండా మిషన్​ భగీరథ నీటి సరఫరాతో పాటు ప్రత్యామ్నాయంగా బోర్​వెల్స్​, చేతి పంపుల మరమ్మతులు చేయించి సిద్ధంగా ఉంచాలని సూచించారు.

అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్డీవో శ్రీనివాస్​, కడా ప్రత్యేకాధికారి వెంకట్​రెడ్డి, తహసీల్దార్​ విజయ్​కుమార్​, మున్సిపల్​ కమిషనర్​ బలరామ్​నాయక్​, మిషన్​ భగీరథ సూపరింటెండెంట్ఆంజనేయులు, ఇంజనీర్లు బాబు,శ్రీనివాస్​, పాల్గొన్నారు.