హెచ్ పీఎస్​లో అడ్మిషన్​కు ఎస్సీ అభ్యర్థులు అప్లై చేసుకోండి : నారాయణ రెడ్డి

హెచ్ పీఎస్​లో అడ్మిషన్​కు ఎస్సీ అభ్యర్థులు అప్లై చేసుకోండి : నారాయణ రెడ్డి

వికారాబాద్, వెలుగు : హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (బేగంపేట) 1వ తరగతిలో ప్రవేశానికి అర్హులైన ఎస్సీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన వారై ఉండాలని, ఒక  కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే ప్రవేశం కల్పిస్తారని పేర్కొన్నారు.

జిల్లాకు రెండు సీట్లు కేటాయించినట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని వారి వార్షిక ఆదాయం రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ. 2 లక్షలకు మించకుండా ఉండాలని చెప్పారు. విద్యార్థులు 01.06.2017 నుంచి 31. 05.2018 మధ్య జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు ఫారాలు జిల్లా షెడ్యుల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఆఫీసు రూం నంబర్ ఎఫ్-–10 వికారాబాద్ కలెక్టరేట్ లో తీసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను మార్చి 12 లోపు సమర్పించాలని,  వివరాలకు 9573859268 నంబర్ లో సంప్రదించాలని వివరించారు.