నలుగురు బాలికలపై లైంగికదాడి?.. ప్రేమ పేరుతో ఒకరిని ట్రాప్ చేసిన యువకుడు

నలుగురు బాలికలపై లైంగికదాడి?.. ప్రేమ పేరుతో ఒకరిని ట్రాప్ చేసిన యువకుడు
  • ప్రైవేట్​ వీడియోలు తీసి.. అమ్మాయిలను పరిచయం చేయాలని బెదిరింపు 
  • నలుగురు ఫ్రెండ్స్‌‌‌‌తో కలిసి మరో ముగ్గురిపైనా లైంగికదాడి 
  • నిందితులను కొట్టి వీడియో డిలీట్​చేయించిన ఎస్ఐ
  • ఓ వీడియో బయటకు రావడంతో తాజాగా పోక్సో కేసు నమోదు   

పరిగి, వెలుగు:  వికారాబాద్ జిల్లా దోమలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో ఓ బాలికను ట్రాప్​చేసిన యువకుడు ఆమె ప్రైవేట్​ వీడియోలు తీసి లైంగిక దాడి చేసినట్టు తెలుస్తోంది. వాటితో బ్లాక్​మెయిల్​చేసి ఆమెకు తెలిసిన మరింత మంది అమ్మాయిలను పరిచయం చేయాలని ఒత్తిడి తెచ్చి.. అలా మరో ముగ్గురు బాలికల పై నలుగురు స్నేహితులతో కలిసి లైంగికదాడి చేసినట్టు సమాచారం.

దోమ మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలికను ప్రేమిస్తున్నానంటూ వెంట పడ్డాడు. ఆమె అతడిని నమ్మడంతో తెలియకుండా ప్రైవేట్​వీడియోలు తీశాడు. తాను చెప్పినట్టు వినకపోతే ఆ వీడియోలను సోషల్​మీడియాలో షేర్​చేస్తానని బెదిరించాడు. ఆమెకు తెలిసిన బాలికలను ఒకరి తర్వాత ఒకరిని పరిచయం చేసుకుని వారి ప్రైవేట్​వీడియోలు కూడా తీసినట్టు తెలి సింది.

ఆ వీడియోలతో వారిని కూడా బ్లాక్​మెయిల్​చేసి నలుగురు స్నేహితులతో కలిసి లైంగికదాడి చేశాడు. ఇలానే వేధింపులు కొనసాగుతుండడంతో మొదటి బాలిక ధైర్యం చేసి ఏదైతే అది అవుతుందని తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు వారం కింద దోమ పీఎస్‌‌‌‌లో కంప్లయింట్​ఇవ్వడంతో ఎస్‌‌‌‌ఐ నిందితులను పీఎస్‌‌‌‌కు పిలిపించాడు. యువకులను చితకబాదడంతో అసలు విషయం ఒప్పుకున్నారు.

అయితే, కొందరు రాజకీయ నేతలు ఇరువర్గాలను కాంప్రమైజ్ చేయడంతో  నింది తుల ఫోన్లో వీడియోలను డిలీట్​చేయించి వారిని ఎస్‌‌‌‌ఐ విడిచిపెట్టారు. కానీ, వీడియోల్లో ఒకటి బయటకు  రావడంతో పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యా రు. దీంతో బాలిక తల్లిని పిలిపించి ఎస్‌‌‌‌ఐ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐదుగురు యువకులపై మంగళవారం పోక్సో కేసు నమోదు చేశారు. బాలికస్టేట్ మెంట్​ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని పరిగి సిఐ కొండల్​రెడ్డి తెలిపారు. కాగా, లైంగికదాడికి గురైన బాలికలు మొత్తం ఆరుగురి వరకు ఉన్నట్టుగా చెప్తున్నారు.