సోమాజిగూడలోని విల్లామేరీ కాలేజీలో ‘విల్లా ఫెస్టా 2025’ పేరుతో యానివర్సరీ సెలబ్రేషన్స్ మంగళవారం ఘనంగా జరిగాయి. రాజవంశాల నుంచి వికసిత్ భారత్ వరకు దేశ చారిత్రక పరిణామాన్ని ఏడు యుగాల నృత్య ప్రదర్శనల ద్వారా విద్యార్థులు అద్భుతంగా ఆవిష్కరించారు. అలాగే150 ఏండ్ల వందేమాతరం, క్రిస్మస్ నేటివిటీ నాటకంతో గ్రాండ్ ఫినాలే నిర్వహించారు. – వెలుగు, హైదరాబాద్ సిటీ
