శివ్వంపేట మండలంలో గొరిల్లా వేషాలతో కోతులను తరుముతున్రు

శివ్వంపేట మండలంలో  గొరిల్లా వేషాలతో కోతులను తరుముతున్రు
  •     ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న సర్పంచ్ 

శివ్వంపేట, వెలుగు: తనను గెలిపిస్తే గ్రామంలో కోతుల బెడద నివారిస్తానని ఎన్నికల్లో ఇచ్చిన హామీని శివ్వంపేట మండలం కొంతన్ పల్లి సర్పంచ్​ విజయ వెంకట్రాం​రెడ్డి నిలబెట్టుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వెళ్లినపుడు ప్రజలు కోతుల సమస్యతో పడుతున్న ఇబ్బందులను తెలిపారు. కోతుల సమస్య పరిష్కరిస్తేనే ఎన్నికల్లో ఓటేస్తామని చాలా మంది చెప్పారు. 

ఈ మేరకు ఆయన తనను సర్పంచ్ గా​గెలిపిస్తే కోతుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సర్పంచ్​గా గెలుపొందిన విజయ వెంకట్రాంరెడ్డి ఆన్ లైన్ లో రూ.15 వేలు పెట్టి 5  గొరిల్లా డ్రెస్సులు తెప్పించారు. నలుగురు వ్యక్తులను నియమించి వారికి రోజుకు రూ.800 కూలీ ఇస్తూ గొరిల్లా డ్రెస్సులు వేసి గ్రామంలో తిప్పుతుండడంతో కోతులు ఊరు వదులుతున్నాయి. 

 తిమ్మాపూర్​లో..

కౌడిపల్లి: మండలంలోని తిమ్మాపూర్ లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ వెంకాగౌని వెంకటమ్మ శనివారం ఇద్దరు వ్యక్తులకు ఎలుగుబంటి వేషం వేయించి గ్రామంలో తిప్పారు. దీంతో కోతులు గ్రామంలో నుంచి బయటకు పరుగులు తీశాయి. ఎలుగు బంటి వేషాల వల్ల కోతుల బెడద నుంచి విముక్తి కలిగిందని గ్రామస్తులు చెబుతున్నారు.