వందరోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం : వినయ్ రెడ్డి

వందరోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం : వినయ్ రెడ్డి

ఆర్మూర్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్​ అభ్యర్థి పొద్దుటూరి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్ మండలంలోని పిప్రి, మంథని, ఆమ్దాపూర్, మగ్గిడి, ఖానాపూర్ గ్రామాల్లో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వినయ్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలోనే ముంపు గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు.

పదేండ్ల బీఆర్ఎస్​పాలనలో కనీసం రోడ్లు కూడా వేయలేదని ఎద్దేవా చేశారు. ఖానాపూర్ కు కవితపూర్ అని పేరు పెట్టుకొని కనీసం ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్​కు చెందిన నాయకులు వినయ్​రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. లీడర్లు మార చంద్రమోహన్, యాల్ల సాయిరెడ్డి, కోలా వెంకటేశ్, విట్టం జీవన్, చిన్నారెడ్డి, పుట్టింటి శ్రీనివాస్ రెడ్డి, జీవన్ రెడ్డి, గంగారెడ్డి, పోషన్న, మల్లయ్య, ముక్కెర విజయ్, మల్లారెడ్డి పాల్గొన్నారు.