మిస్​ వరల్డ్​ కంటెస్టెంట్లకుఅంబేద్కర్ విగ్రహాన్ని చూపించాలి : మాజీ ఎంపీ వినోద్​కుమార్​

మిస్​ వరల్డ్​ కంటెస్టెంట్లకుఅంబేద్కర్ విగ్రహాన్ని చూపించాలి : మాజీ ఎంపీ వినోద్​కుమార్​

హైదరాబాద్​, వెలుగు: మిస్​ వరల్డ్​ కంటెస్టెంట్లను అన్ని పర్యాటక ప్రాంతాలకు తిప్పుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. 125 అడుగుల అంబేద్కర్​ విగ్రహం వద్దకు మాత్రం ఎందుకు తీసుకెళ్లడం లేదని బీఆర్ఎస్​ మాజీ ఎంపీ వినోద్​కుమార్​ ప్రశ్నించారు. ప్రపంచంలోనే ఎంతో గొప్పగా నిర్మించుకున్న విగ్రహం వద్దకు తీసుకెళ్లకుండా సీఎం రేవంత్​ రెడ్డి ఎందుకు విస్మరిస్తున్నారన్నారు. 

మంగళవారం ఆయన తెలంగాణ భవన్​లో మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్​ జీవిత చరిత్రను మిస్​వరల్డ్ కంటెస్టెంట్లకు వివరించాలని డిమాండ్​ చేశారు.  రేవంత్​ రెడ్డి చేసిన తప్పిదాన్ని సరిచేసుకోవాలన్నారు.