పపువా న్యూగినియాలో హింసాకాండ

పపువా న్యూగినియాలో హింసాకాండ

మెల్బోర్న్: పపువా న్యూగినియా దేశంలో దారుణం జరిగింది. రెండు తెగల మధ్య జరిగిన హింసాకాండలో 26 మంది ప్రాణా లు కోల్పోయారు. అంబులిన్, సికిన్ అనే తెగల మధ్య రాజుకున్న గొడవ తీవ్రతరం అయింది. ఓ వర్గం మరో వర్గంపై దాడి చేయగా, వాళ్లు ఫైరింగ్ మొదలు పెట్టారు. కాల్పుల్లో మొత్తం 64 మంది ప్రాణాలు కోల్పోయారని ముందుగా చెప్పిన పోలీసులు, అనంతరం ఆ సంఖ్యను 26కు తగ్గించారు. సోమవారం ఎంగా ప్రావిన్స్​పరిధి వాగాబ్ టౌన్​లో ఈ హింసాత్మక ఘటనలు జరిగినట్లు తెలిపారు. వీటికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో ఆర్మీ అలర్ట్ అయింది. ఆ ప్రాంతంలో భారీగా సైన్యాన్ని మోహరించారు. స్పాట్ నుంచి మృతదేహాలను తరలిస్తున్నారు. ఇంకా కాల్పులు జరుగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరగే చాన్స్ ఉంది. పోయినవారంలో జరిగిన రక్తాపాతంతో పోలిస్తే తాజాగా జరుగుతున్న గొడవ చిన్నదేనని అక్కడి మీడియా వెల్లడించింది. ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారో లెక్కించలేమని పేర్కొంది. ఈ ఘటనపై న్యూగినియా ప్రధాని స్పందిస్తూ, మరింత సైన్యాన్ని మోహరించాలని ఆదేశించారు.