వీఐపీ బ్రేక్ దర్శనాలు ఎవరి కోసం?

వీఐపీ బ్రేక్ దర్శనాలు ఎవరి కోసం?

టీటీడీ లో అమలవుతున్న వీఐపీ బ్రేక్ దర్శనాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టు లో పిటిషన్ దాఖలైంది. దేవాలయాల్లో దైవరాధన హక్కు అందరికి సమానంగా ఉంటుందంటూ పిటిషనర్ తన పిటిషన్ లో పేర్కొన్నాడు. L1, L2, L3 దర్శనాలు రద్దు చేయాలని, VIP బ్రేక్ దర్శనానికి టీటీడీ చట్టంలో గాని, జీవోలో గానీ, ఎవైనా గైడ్ లైన్స్ ఉంటే కోర్ట్ ముందు పెట్టాలని పిటిషనర్ కోరాడు. ఏ ప్రాతిపదికన భక్తులను వీఐపీ, నాన్ వీఐపీ విభజించారో తెలపాలని పిటిషనర్ తరపు న్యాయవాది ఉమేష్ చంద్ర కోర్టులో తన వాదనలు వినిపించాడు.

వాదనలు విన్న కోర్టు వీఐపీ బ్రేక్ దర్శనాలపై పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రభుత్వంతో పాటు టీటీడీ స్టాండింగ్ కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.