ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డును గెలుచుకున్న కమెడియన్‌ వీర్‌దాస్‌

ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డును గెలుచుకున్న కమెడియన్‌ వీర్‌దాస్‌

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుల వేడుకల్లో ఒకటైన ఎమ్మీ అవార్డులు(Emmy Awards) న్యూయార్క్ నగరంలో ఘనంగా జరిగాయి. సోమవారం 2023 నవంబర్ 20న 51వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డ్స్ ప్రకటించడంతో నేషనల్ వైడ్గా సంబరాలు మొదలయ్యాయి. టెలివిజన్ రంగంలో ఎంతో ఫేమస్ గల ఈ అవార్డును ఆస్కార్ అవార్డుతో పోలుస్తారు. ఇందులో 20 దేశాల నుంచి 14 విభాగాల్లో నామినీలు ఉన్నారు.

స్టాండప్ కమెడియన్ వీర్‌దాస్(Vir Das) అంతర్జాతీయ ఎమ్మీ అవార్డు- 2023(International Emmy Awards 2023) గెలుచుకున్నాడు.  నెట్‌ఫ్లిక్స్(Netflix) లో స్ట్రీమింగ్‌ అయిన 'వీర్ దాస్: ల్యాండింగ్' కామెడీ సిరీస్‌కు గాను ఎమ్మీ అవార్డు దక్కింది. ఈ అవార్డు కోసం ఆయన ఇప్పటి వరకు రెండు సార్లు నామినేట్‌ అయ్యాడు. కానీ ఈసారి విన్నర్‌గా నిలిచాడు. అలాగే UK షో డెర్రీ గర్ల్స్ సీజన్ 3తో ఈ అవార్డును పంచుకున్నాడు. అంతేకాకుండా ఈ అవార్డు గెలుచుకున్న మొదటి ఇండియన్‌ కెమెడియన్‌గా వీర్‌దాస్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేశాడు.

ఈ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్‌ షేర్ చేసిన ఒక ట్వీట్లో, వీర్ దాస్ తన భావాన్ని పంచుకుంటూ.. 'ఈ క్షణం నిజంగా నమ్మసక్యంగా లేదు..ఇది ఒక కలలా భావించే ఒక అద్భుతమైన గౌరవం. 'కామెడీ కేటగిరీ'లో 'వీర్ దాస్: ల్యాండింగ్'కి ప్రతిష్టాత్మకమైన ఎమ్మీ అవార్డు దక్కడం నాకు ఒక మైలురాయి మాత్రమే కాదు..మన దేశానికి గర్వకారణంగా భావిస్తున్న.ఇప్పుడు 'వీర్ దాస్: ల్యాండింగ్'తో వరల్డ్ వైడ్ గా భారత్‌ పేరు ప్రతిధ్వనించడం చాలా సంతోషంగా ఉందంటూ..వీర్ దాస్ తెలిపారు. 

ఈసారి 2023 సంవత్సరానికి గాను OTT ప్లాట్‌ఫారమ్‌లోని రెండు భారతీయ సిరీస్‌లు ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్లో నామినేట్ చేయబడ్డాయి. ఇందులో ఒకటి నటి షెఫాలీ షా నటించిన ఢిల్లీ క్రైమ్ సీజన్ 2..మరొకటి వీర్ దాస్ కామెడీ స్పెషల్ వీర్ దాస్ నామినేట్ చేయబడ్డాయి. అయితే, షెఫాలీ షా ఢిల్లీ క్రైమ్ సీజన్ 2 మాత్రం ఈ అవార్డును కైవసం చేసుకోలేకపోయింది. అలాగే లా కైడా సిరీస్‌కు అవార్డు గెలుచుకున్న మెక్సికన్ నటుడు కార్లా సౌజాకు ఉత్తమ నటి అవార్డును కోల్పోయింది.