
బాలీవుడ్ కే వన్నె తెచ్చే అందాల తార ఐశ్వర్యరాయ్ బచ్చన్ ‘పొన్నియన్ సెల్వన్’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఐశ్వర్య రాయ్ రాణీ నందినిగా ప్రేక్షకులను అలరించనున్నారు. కాగా ఈ సినిమా చిత్రీకరణ సెట్స్ నుంచి తాజాగా ఐశ్వర్యరాయ్ పాత్రకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో బాలీవుడ్ క్వీన్ ఐశ్వర్యా ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. మళ్లీ తమ అభిమాన నటి వెండితెరపై సందడి చేస్తుండడం చూసి వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘అవర్ క్వీన్ ఈజ్ బ్యాక్ (Our queen is back)’ అనే కామెంట్లతో నెట్టింట్లో హోరెత్తించేట్టుగా పోస్టులు చేస్తు్న్నారు.
48 యేళ్ల ఐశ్వర్య రాయ్ పెళ్లి తర్వాత చాలా కొద్ది సినిమాల్లో మాత్రమే కనిపించారు. 2018లో ‘ఫాన్నీ ఖాన్’ సినిమా తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కనున్న తమిళ మూవీ ‘పొన్నియన్ సెల్వన్’ ద్వారా సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కాగా తాను ఈ చిత్రంలో నటిస్తున్నానంటూ ఐశ్వర్యా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా జులై 19న అధికారికంగా ప్రకటించారు. దాంతో పాటు ఆ సినిమాలోని పాత్రను కూడా ఆమె అనౌన్స్ చేశారు.