వైరల్ వీడియో: నన్నే టికెట్ అడుగుతారా..? అంటూ వీరంగం

వైరల్ వీడియో: నన్నే టికెట్ అడుగుతారా..? అంటూ వీరంగం

అనంతపురం: ఓ హోంగార్డు.. ఆర్టీసీ బస్సులో టికెట్ తీసుకోకుండా.. కండక్టర్, డ్రైవర్లను దుర్భాషలాడుతూ న్యూసెన్స్ క్రియేట్ చేసిన హోంగార్డు ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘ నన్నే టికెట్ అడుగుతావా.. బస్సులో ఏదైనా జరిగితే కాపాడేదెవరు..? చెకింగ్ వస్తే ఐదు వేలు ఫైన్ వేసినా కడతా.. బస్సు తీయ్.. ముందు.. అంటూ.. బూతులు తిడుతూ  హల్చల్ చేయడం సంచలనం రేపింది. వారెంట్ అడిగితే లేదంటూ.. టికెట్ అడిగితే తీసుకోనంటూ వాగ్వాదానికి దిగడంతో బస్సు కొద్దిసేపు నిలిపేయాల్సి వచ్చింది. వీడియో తీస్తూ.. మీ ఉన్నతాధికారులకు పంపమంటావా అంటూ డ్రైవర్ హెచ్చరిస్తే.. చేతనైంది చేసుకో.. ఎస్పీకి పంపించుకో.. అంటూ బదులిచ్చారు. అనంతపురం జిల్లా గుత్తి పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్న ఈ హోంగార్డు క్రియేట్ చేసిన న్యూసెన్స్ ను వీడియో తీసిన బస్సు డ్రైవర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వెంటనే వైరల్ అయింది. ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

ఇవీ చదవండి..

రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నానంటే..

వైరల్ వీడియో: నన్నే టికెట్ అడుగుతారా..? అంటూ వీరంగం

రూ.5 లక్షల నుంచి వెయ్యి కోట్ల కంపెనీగా విశా