2027 ODI World Cup: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ కి రెడీ అయింది. మరో వారం రోజుల్లోనే మెగా క్యాచ్ రిచ్ లీగ్ ప్రారంభం కానుంది. ఇది పూర్తయ్యే వరకూ ఏ టీమిండియా క్రికెటర్ అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం లేదు. కానీ, బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాత్రం సైలెంట్ గా 2027 వన్డే వరల్డ్ కప్ కోసం జట్టును సిద్ధం చేసే పనిలో పడింది. ఇప్పటికే ఓ 20 మందితో కూడిన ప్రాబబుల్స్ లిస్ట్ ని సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఐపీఎల్ మ్యాచుల్లోనూ సదరు ప్లేయర్ల ఆటతీరును సెలక్టర్లు దగ్గరుండి పరిశీలించనున్నారు.
ప్రతి సెలక్టర్ కచ్చితంగా వారానికి ఒక్క మ్యాచ్ అయినా స్టేడియానికి వెళ్లి చూసేలా బీసీసీఐ రూల్ పెట్టింది. ఇలా అందరూ కలిసి వారానికి ఐదు మ్యాచులను కవర్ చేసేలా ప్లాన్ చేసింది. ఐపీఎల్లో మ్యాచులను గమనించడమంటే 2028లో లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్, టీ20 ప్రపంచ కప్ ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే కాదు.. 2027లో వన్డే వరల్డ్ కప్ కోసం కొత్తగా స్టార్ ని వెతికే అవసరం లేదు.. ఉన్న ఆటగాళ్లపై అంచనా వేయాలి. హర్షిత్ రాణా గాయందె ఇప్పటికే టోర్నీ నుంచి వైదొలగగా.. మిగిలిన పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ, అర్షీప్ సింగ్, హార్దిక్ పాండ్య ఆటను సెలక్టర్లు ట్రాక్ చేయనున్నారని బీసీసీఐ అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఐపీఎల్ ముగిసిన అనంతరం అఫ్ఘనిస్తాన్ తో భారత్ ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ ఆడబోతుంది. ఇది టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగం కాదన్నారు. భారత జట్టులో ప్రతి సీనియర్ ప్లేయర్ బరిలోకి దిగుతాడని బీసీసీఐ తెలిపింది. డబ్ల్యూటీసీ నాలుగో సీజన్ లో టీమిండియా ఇంకా 9 టెస్టులను ఆడనుంది. బుమ్రా, సిరాజ్ సహా ఇతర పేసర్లు బరిలోకి దిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది.. భారత్ టెస్టు క్యాంపుని ప్రయోగాలకు వేదికగా మార్చాలని అనుకోవడం లేదన్నారు. దాని కోసం ఇండియా– A టూర్లు ఉన్నాయి. ప్రతి టెస్టులోనూ బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధి ఆడించేందుకు సెలక్టర్లు నజర్ పెట్టారని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
