Laxman Sivaramakrishnan: బీసీసీఐ వ్యాఖ్యాతగా తన సుదీర్ఘ ప్రయాణానికి స్వస్తి పలుకుతున్నట్లు భారత మాజీ లెగ్ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ సంచలన ప్రకటన చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ప్రారంభానికి ముందే ఈ నిర్ణయం తీసుకోవడం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేవలం రిటైర్మెంట్ ప్రకటించడమే కాకుండా, తనపై వివక్ష చూపించారంటూ ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా శివరామకృష్ణన్ తన ఆవేదనను వెళ్లగక్కారు. 23 ఏళ్లుగా కామెంటరీ బాక్స్‌లో ఉన్నా, తనకు సరైన అవకాశాలు ఇవ్వలేదన్నారు.
అయితే, రవిశాస్త్రి టీమ్ ఇండియా కోచ్‌గా ఉన్న సమయంలో కూడా తనకు టాస్ వేయించే అవకాశం లేదా ప్రజెంటేషన్ సెర్మనీలు నిర్వహించే అవకాశం ఇవ్వలేదని వెటరన్ కామెంటేటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ ఆరోపించారు. బీసీసీఐ ప్యానెల్ లోకి కొత్తగా వచ్చిన వారికి ఇస్తున్న ప్రాధాన్యత తనకు ఎందుకు ఇవ్వడం లేదని ఒక యూజర్ ప్రశ్నించగా.. తాను నలుపు రంగులో ఉండటం వల్లే ఇలా జరుగుతోందని సంచలన సమాధానం ఇచ్చారు. ఈ రిటైర్మెంట్ కేవలం ఈ కథకు ఆరంభం మాత్రమే.. నేను నిజాలు చెబితే క్రికెట్ అభిమానులు, సామాన్య ప్రజలు షాక్‌కు గురవుతారు.. బీసీసీఐ కూడా నమ్మలేనన్ని నిజాలు బయటపెడతాను అని హెచ్చరించారు. నన్ను ద్వేషించే వాళ్లు ఈ రిటైర్మెంట్ వార్తతో సంతోషపడతారు, కానీ తనకు గౌరవం ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని శివరామకృష్ణన్ వెల్లడించారు.
లక్ష్మణ్ శివరామకృష్ణన్ కెరీర్:
* శివరామకృష్ణన్ 1985లో వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆప్ క్రికెట్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నారు. ఆ టోర్నీలో అతను 5 మ్యాచ్‌లలో 10 వికెట్లు తీసుకున్నాడు.
* ఏప్రిల్ 1983లో, 17 సంవత్సరాలు 118 రోజుల్లో భారత్ కోసం అతి పిన్న వయస్కుడిగా టెస్ట్ డెబ్యుట్ ప్లేయర్‌గా రికార్డులు స్థాపించాడు. ప్రస్తుత రికార్డు సచిన్ టెండూల్కర్ పేరుపై ఉంది.
* శివరామకృష్ణన్ 9 టెస్ట్‌లు, 16 వన్డేలు ఆడారు. రెడ్ బాల్ క్రికెట్‌లో 26 వికెట్లు, వైట్ బాల్ క్రికెట్‌లో 15 బాటర్లను అవుట్ చేశారు.
* మొత్తం 76 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 154 వికెట్లు తీశారు. 5 శతకాలతో 1802 పరుగులు సాధించారు, 25.02 సగటుతో.
* లిస్ట్ ఏ మ్యాచ్‌లలో 33 మ్యాచ్‌లలో 37 వికెట్లు తీసుకున్నాడు. 1987 వన్డే వరల్డ్ కప్‌లో చివరి మ్యాచ్ ఆడారు.
* రాహుల్ ద్రావిడ్ కోచింగ్ సమయంలో, భారత స్పిన్నర్లకు శిక్షణ ఇచ్చేందుకు ఆసక్తి చూపించారు.
Laxman Sivaramakrishnan latest X Tweets 🗣️
— Fan Account Richard Kettlebourogh (@RichKettle07) March 20, 2026
"I am retiring from commentary for BCCI. If I have not been used for TOSSES and PRESENTATION for 23 years and new comers come in do pitch report Tosses Presentation even when Shastri was coaching, what do you think could be the reason" pic.twitter.com/5qU8KVhN9X
