సభలో ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించిన రైతు

V6 Velugu Posted on Jan 08, 2022

ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించాడో రైతు. ఉన్నావ్  నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే పంకజ్ గుప్తా... ఓ బహిరంగ సభలో పాల్గొన్నాడు. వేదికపై వచ్చిన ఓ రైతు అందరి ముందే ఎమ్మెల్యేను కొట్టాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు... ఆ రైతును అక్కడ్నుంచి తీసుకెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే తనను కొట్టిన ఆ రైతుతో మీడియా ముందుకొచ్చాడు ఎమ్మెల్యే పంకజ్ గుప్తా. ఆ రైతు తన తండ్రిలాంటివాడని... ప్రేమతోనే అలా కొట్టాడని వివరణ ఇచ్చుకున్నాడు. రైతు కూడా ఎమ్మెల్యేను అభిమానంతోనే కొట్టానని సమర్థించుకున్నాడు.

 

Tagged UP, Viral Video, clarification, slap, BJP MLA Pankaj gupta, face

Latest Videos

Subscribe Now

More News