ఈ వీడియో చూస్తే తెలుస్తది.. ఆ ఏనుగు ఎంత ఆకలిగా ఉందో

ఈ వీడియో చూస్తే తెలుస్తది.. ఆ ఏనుగు ఎంత ఆకలిగా ఉందో

పట్టపగలు. మిట్టమధ్యాహ్నం. నడిరోడ్డు మీద వేగంగా వెళుతున్న బస్సును ఆపింది ఓ ఏనుగు. అమాంతం తన తొండంతో బస్సులో ఉన్న అరటి గెలను దొంగతనం చేయడం ఆసక్తికరంగా మారింది. అందులో ఆకట్టుకోవడానికి ఏముందంటారా..? ఆకలేసింది. బస్సుఆపి అరటికాయల్ని తినేసింది అని సింపుల్ గా కొట్టిపారేయోచ్చు.

శ్రీలంకలోని కట్రంగమలో ప్రయాణికులతో ఓ బస్సు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతుండగా..మార్గం మధ్యలో ఆ బస్సును ఓ ఏనుగు ఆపింది. ఆ ఏనుగుకి బస్సులో అరటి పండ్లు ఎక్కడ ఉన్నాయో ఎలా తెలిసిందే. రోడ్డు మీద ఉన్న ఏనుగు  బస్సు లోపల డ్రైవర్ సీటు పక్కనే ఉన్న అరటిగెలను తనతొండంతో ఆరగించేందుకు ప్రయత్నం చేయడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ఐఎఫ్ ఎస్ అధికారి ప్రవీణ్ కేశ్వాన్ విడుదల చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో బస్సులో అరటి పండ్లు ఉన్నట్లు ఏనుగు ఎలా కనిపట్టిందబ్బా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం వైరల్ అవుతున్న వీడియోలోని విన్యాసాన్ని మీరూ చూసేయండి.