నన్నునీలో చూస్తున్నా

నన్నునీలో చూస్తున్నా

విరాట్‌‌తో విండీస్ లెజెండ్‌‌ వివ్‌‌ రిచర్డ్స్‌‌

వెస్టిండీస్‌‌తో తొలి టెస్ట్‌‌కు ముందు టీమిండియా కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ యాంకర్‌‌ అవతారమెత్తాడు. తన ఆరాధ్య క్రికెటర్‌‌, వెస్టిండీస్‌‌ లెజెండ్‌‌ సర్‌‌ వివ్‌‌ రిచర్డ్స్‌‌ను ఇంటర్వ్యూ చేశాడు.  మీ  కెరీర్‌‌లో సవాళ్లను ఎలా అధిగమించేవారని కోహ్లీ అడుగగా.. ‘పోటీకి తగినవాడినని, నాకు తెలిసిన దారిలో నన్ను నేను నిరూపించుకోవాలని ఎప్పుడూ అనుకునేవాడినని.  అదే లక్షణం ఇప్పుడు నీలో చూస్తున్నా. కానీ, కొన్నిసార్లు ప్రజలు దీన్ని వేరే రకంగా చూసేవారు. వీళ్లు ఇంత  కోపంగా ఎందుకున్నారని అనుకునేవారు’ అని రిచర్డ్స్‌‌ చెప్పాడు. ఇక,  బౌన్సర్ల వల్ల తగిలే  దెబ్బలపై  కోహ్లీ భిన్నంగా స్పందించాడు.  స్టార్టింగ్‌‌లో బాల్‌‌ తగిలితే మంచిదనిపిస్తుందని, లేదంటే క్రీజులో ఉన్నంతసేపు ఆత్మరక్షణ ధోరణిలో ఆడాల్సి వస్తుందని అన్నాడు. అంతేకాక ఓసారి దెబ్బ తగిలిన తర్వాత మరోసారి అలా జరగకుండా ఉండాలనే పట్టుదల పెరుగుతుందని విరాట్‌‌ అభిప్రాయపడ్డాడు.