Virat Kohli: ఐపీఎల్2026 సీజన్ క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఈ హై-వోల్టేజ్ పోరులో కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో చెలరేగి, లీగ్ చరిత్రలోనే అత్యంత అరుదైన మైలురాయిని అధిగమించి క్రికెట్ ప్రపంచాన్ని మరోసారి తన వైపుకి మలుపుకున్నాడు.
ధర్మశాలలో కోహ్లీ విశ్వరూపం:
ధర్మశాల వేదికగా జరిగిన ఈ కీలకమైన ప్లేఆఫ్ మ్యాచ్‌లో పిచ్ బ్యాటింగ్‌కు అంత సులభంగా ఏమీ లేదు.. ఒకవైపు గుజరాత్ బౌలర్లు నిప్పులు చెరిగే బౌలింగ్ చేయగా, మరోవైపు బెంగళూరు స్టార్ బ్యాటర్ కోహ్లీ మాత్రం తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. ప్రత్యర్థి బౌలర్లు కగిసో రబడా, మహ్మద్ సిరాజ్, జేసన్ హోల్డర్ లపై దాడికి దిగుతూ మైదానం నలుమూలలా అద్భుతమైన షాట్లతో చెలరేగాడు. జస్ట్ 25 బంతుల్లోనే 43 రన్స్ తో జట్టుకు మంచి ఆరంభాన్ని అందించాడు. చివరకు హోల్డర్ బౌలింగ్‌లో అవుట్ అయినప్పటికీ, ఈ క్రమంలో ఐపీఎల్ లో ఎవరికీ సాధ్యంకాని ఒక రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు.
సరికొత్త ప్రపంచ రికార్డు:
ఈ మ్యాచ్‌లో కొట్టిన పరుగులతో విరాట్ కోహ్లీ, లీగ్ చరిత్రలో వరుసగా నాలుగు సీజన్లలో (2023, 2024, 2025, 2026) 600+ కు పైగా రన్స్ సాధించిన మొట్టమొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు ఈ రికార్డు కేఎల్ రాహుల్ పేరిట సంయుక్తంగా ఉండేది.. రాహుల్ గతంలో 2020, 2021, 2022 సీజన్లలో వరుసగా 3 సార్లు ఈ ఘనత సాధించగా, తాజాగా కోహ్లీ ఆ రికార్డును అధిగమించి అగ్రస్థానాన్ని ఆధిగమించాడు. టీ20 ఫార్మాట్‌లో తన ఆటతీరుపై విమర్శలు చేసిన వారందరికీ ఈ చరిత్రతో విరాట్ బ్యాట్ తోనే ఆన్సర్ ఇచ్చాడు.
ఆర్సీబీ పరుగుల జాతర:
ఈ 2026 సీజన్‌లో విరాట్ కోహ్లీ ఆరంభం నుంచే భీకరమైన ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు. లీగ్ దశలోనే ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలతో బెంగళూరు జట్టును ఒంటిచేత్తో ప్లేఆఫ్స్ కి చేర్చిన కోహ్లీ, అత్యధిక రన్స్ చేసిన టాప్ బ్యాటర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. క్వాలిఫయర్-1 లాంటి ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లోనూ జట్టును ముందుండి నడిపించి తనలోని అసలైన ఛాంపియన్‌ను మరోసారి ఈ ప్రపంచానికి కింగ్ కోహ్లీ చాటి చెప్పాడు.
𝐓𝐡𝐞 𝐆𝐨𝐥𝐝 𝐒𝐭𝐚𝐧𝐝𝐚𝐫𝐝 🌟
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 26, 2026
Virat Kohli becomes the first player to score 6️⃣0️⃣0️⃣+ runs in 4️⃣ consecutive #TATAIPL seasons. 🫡🔥 pic.twitter.com/sNBOTuT9eP
