కింగ్ కోహ్లి ముందు వరల్డ్ రికార్డ్.. 43 రన్స్ కొడితే హిస్టరీనే!

కింగ్ కోహ్లి ముందు వరల్డ్ రికార్డ్.. 43 రన్స్ కొడితే హిస్టరీనే!

Virat Kohli: ఐపీఎల్ 2026లో కాసేపట్లో ధర్మశాల వేదికగా క్వాలిఫైయర్-1తో మొదలుకానుంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు తలపడబోతున్నాయి. ఈ కీలకమైన మ్యాచ్‌లో రన్ మెషిన్ విరాట్ కోహ్లి అసాధ్యమైన రికార్డును అందుకునే గోల్డెన్ ఛాన్స్ ఉంది. ఇవాళ మ్యాచ్‌లో కోహ్లి గనుక మరో 43 పరుగులు చేస్తే.. ఐపీఎల్ హిస్టరీలోనే వరుసగా నాలుగు సీజన్లలో 600కు పైగా రన్స్ చేసిన మొట్ట మొదటి ఏకైక బ్యాటర్‌గా వరల్డ్ రికార్డు సృష్టించే అవకాశం ఉంది.  

ఇప్పటికే కోహ్లి 2023, 2024, 2025 సీజన్లలో 600+ రన్స్ కొట్టేసిండు. గీ సీజన్ లీగ్ స్టేజ్‌లో కూడా 14 ఇన్నింగ్స్‌లలో 50.63 సగటు, 163.82 భీకరమైన స్ట్రైక్ రేట్‌తో 557 పరుగులు కొట్టి అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇవాళ గనుక ఆ 43 రన్స్ కొడితే చరిత్ర తిరగరాయడం ఖాయంగా కనిపిస్తుంది.

ఐపీఎల్‌లో ఈ రికార్డు ఉన్న ఆ ముగ్గురు ప్లేయర్స్:
ఐపీఎల్ సుదీర్ఘ చరిత్రలో వరుసగా మూడు సీజన్లలో 600+ కంటే ఎక్కువ రన్స్ చేసినోళ్లు ఇప్పటి వరకు కేవలం ముగ్గురంటే ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఆ ప్లేయర్స్ ఎవరో చూద్దాం పదండి మరీ. 

* క్రిస్ గేల్: 2011, 2012, 2013 సీజన్లలో ఆర్సీబీ తరఫున దంచికొట్టిండు.
* డేవిడ్ వార్నర్: 2016, 2017, 2019 సీజన్లలో ఎస్‌ఆర్‌హెచ్ తరఫున రచ్చ లేపిండు. (మధ్యలో 2018 లో 'బాల్ ట్యాంపరింగ్'తో వార్నర్‌పై ఏడాది పాటు నిషేధం పడటంతో ఆ సీజన్ ఆడలేదు).
* కేఎల్ రాహుల్: 2020, 2021, 2022 సీజన్లలో పరుగుల వరద పారించిండు.
* ఈరోజు విరాట్ కోహ్లి గనుక ఆ 43 పరుగులు కొడితే.. వీళ్లందరినీ దాటేసి వరుసగా 'నాలుగు' సీజన్లలో గీ ఘనత సాధించిన మొట్టమొదటి ఆటగాడిగా నిలుస్తాడు.