పాక్ గ్రేట్ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ మెచ్చుకోలు
న్యూఢిల్లీ: ప్రెజెంట్ క్రికెట్ వరల్డ్‌లో అందరికంటే డేంజరస్ బ్యాట్స్‌మన్ ఎవరంటే విరాట్ కోహ్లీ అని ఎవరైనా ఠక్కున చెబుతారు. తన బ్యాటింగ్ స్కిల్స్, అగ్రెసివ్ యాటిట్యూడ్‌తో ప్రత్యర్థి ప్లేయర్స్‌ను కోహ్లీ భయపెడతానడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అందుకే ఇండియాతో తమ గడ్డపై జరిగిన గత బోర్డర్–గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో కంగారూ ప్లేయర్లు కోహ్లీని కామ్‌గా ఉంచడానికి డిఫరెంట్ స్ట్రాటజీస్‌తో ముందుకెళ్లారు. స్లెడ్జింగ్‌తో ప్లేయర్స్ కాన్‌సన్‌ట్రేట్‌ను దెబ్బతీయడంలో నిష్ణాతులుగా పేరున్న ఆసీస్ ఆటగాళ్లు.. ఆ సిరీస్‌లో మాత్రం కోహ్లీపై కామెంట్ చేయొద్దని డిసైడ్ అవడం గమనార్హం. కోహ్లీకి ప్రత్యర్థి టీమ్స్ ఎంతగా భయపడతాయనడానకి ఇదో ఉదాహరణ మాత్రమే. తాజాగా కోహ్లీని ప్రశంసిస్తూ పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ పలు వ్యాఖ్యలు చేశాడు.

‘అతడు (కోహ్లీని ఉద్దేశించి) పదకొండు మందితో సమానం. ఒక విధంగా చెప్పాలంటే విరాట్ వికెట్ తీస్తే మొత్తం ఇండియన్ టీమ్‌ను ఆలౌట్ చేసినట్లే. 11 మంది ఒక్కడిలో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటాడు కోహ్లీ. మీరు అతణ్ని అలాగే చూడాలి. ఓ బౌలర్‌గా మీరు క్లియర్ మైండ్ సెట్‌తో ఉండాలి. ఈ గేమ్‌లో కోహ్లీ టాప్‌గా ఉన్న ఒక వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మన్. స్పిన్నర్‌ను ఫేస్ చేయడంలో అతడు ఎలాంటి ఇబ్బందులూ పడడు. లెఫ్టామ్ పేసర్ లేదా లెగ్ స్నిన్నర్‌తో అతడికి బౌలింగ్ చేయించాలి. అయితే మొత్తం ప్రపంచం తనను గమనిస్తుంది కాబట్టి ఒత్తిడి మీ మీద కాదు కోహ్లీపైనే ఉంటుందని గ్రహించాలి’ అని సక్లయిన్ చెప్పాడు.
