హాఫ్ సెంచరీతో కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్

హాఫ్ సెంచరీతో కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్

సౌతాంప్టన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డును తన అకౌంట్ లో వేసుకున్నాడు. వరల్డ్ కప్ లో భాగంగా శనివారం అఫ్టనిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో ఈ వరల్డ్ కప్ సీజన్ లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేసిన కెప్టెన్ గా రికార్డుకెక్కాడు.

1992లో మాజీ కెప్టెన్ అజారుద్దీన్ తర్వాత మెగా టోర్నీలో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేసిన రెండో కెప్టెన్‌గా విరాట్ నిలిచాడు. అఫ్గనిస్థాన్‌తో మ్యాచ్‌లో 48 బాల్స్ లో విరాట్ హాఫ్‌సెంచరీ చేశాడు. వన్డే కెరీర్‌లో విరాట్‌కిది 52వది. తక్కువ స్కోరుకే ఓపెనర్లు ఔటవడంతో విరాట్ స్కోరు బోర్డును ముందుండి నడిపిస్తున్నాడు. మరో ఎండ్‌లో మిస్టర్ కూల్ నిలకడగా ఆడుతున్నాడు. 30 ఓవర్లకు భారత్ స్కోరు 133/3. విరాట్(66), ధోనీ(3) క్రీజులో ఉన్నారు.