కోహ్లీ చేజారిన టాప్
టెస్ట్ నం.1 బ్యాట్స్‌మన్‌గా స్మిత్
బౌలర్లలో బుమ్రాకు మూడో ర్యాంక్
దుబాయ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్ స్మిత్ షాకిచ్చాడు. కోహ్లీని వెనక్కునెట్టి టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్ ప్లేస్‌ను కైవసం చేసుకున్నాడు. విండీస్‌తో సెకండ్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో డకౌటైన కోహ్లీ మంగళవారం విడుదలైన ర్యాంకింగ్స్‌లో ఒకటి నుంచి రెండో ప్లేస్‌కు పడిపోయాడు. అదే సమయంలో యాషెస్ సిరీస్‌లో ఇప్పటికే రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ చేసిన స్మిత్ ఒక స్థానం మెరుగై నంబర్ వన్ ర్యాంక్‌కు చేరుకున్నాడు.
స్మిత్ ఖాతాలో ప్రస్తుతం 904 రేటింగ్ పాయింట్లు ఉండగా.. కోహ్లీ (903) ఒక్క పాయింట్ తేడాతో అగ్రస్థానం కోల్పోయాడు. సెకండ్ టెస్ట్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన తెలుగు క్రికెటర్ హనుమ విహారి ఏకంగా నలభై స్థానాలు మెరుగై 30వ ర్యాంక్‌కు చేరాడు. ఇక, వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌ను వణికించిన యువ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా కెరీర్ బెస్ట్ 835 రేటింగ్ పాయింట్లతో బౌలర్ల లిస్ట్‌లో మూడో స్థానానికి దూసుకెళ్లాడు.
