కరోనా దెబ్బ.. కోహ్లీ17కోట్లు, ధోని, రోహిత్ లకు 15 కోట్లు నష్టం!

కరోనా దెబ్బ.. కోహ్లీ17కోట్లు, ధోని, రోహిత్ లకు 15 కోట్లు నష్టం!

కరోనా దెబ్బకు ప్రపంచం అతలాకుతలం అవుతోంది. మన దేశంలో కూడా కరోనా వైరస్ రోజురోజుకు విస్తరిస్తుంది. కరోనా వైరస్ వల్ల  మెగా టోర్నీ ఐపీఎల్-2020 ఏప్రిల్ 15కు వాయిదా వేసినా అసలు టోర్నీ జరుగుతుందా? లేదా అనే అనుమానాలు కల్గుతున్నాయి. జులై సెప్టెంబర్ మధ్యలో నిర్వహించాలని బీసీసీఐ ఆలోచన చేస్తున్నా వైరస్ తీవ్రతపై ఆధారపడి ఉంది. ఒక వేళ 2020లో ఐపీఎల్ టోర్నీ రద్దైతే పరిస్థితి ఏంటి.. ఐపీఎల్ లో కోట్లు పెట్టి కొనుకున్న ప్లేయర్ల సంగతేంటి? ముఖ్యంగా స్టార్ ఆటగాళ్లు కోహ్లీ, రోహిత్ ధోని వంటి పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు. ఇంతకీ వాళ్లు ఎంత నష్టపోతున్నారో ఒక్కసారి చూద్దాం.

వీరాట్ కోహ్లీ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న వీరాట్ కోహ్లీ 2018 ఐపీఎల్ నుంచి ఆ జట్టు యాజమాన్యం కోహ్లీకి 17 కోట్లు చెల్లిస్తుంది. ఒకవేళ ఐపీఎల్  రద్దైతే కోహ్లీకి రూ.17 కోట్లు నష్టమన్నమాట. ఐపీఎల్ లో  అత్యధిక కాస్ట్ లీ ఆటగాడు కోహ్లీనే కావడం గమనార్హం.

రోహిత్ శర్మ

రికార్ట్ స్థాయిలో నాలుగు సార్లు ముంబై ఇండియన్స్ ను ఐపీఎల్ విజేతగా నిలిపిన రోహిత్ శర్మకు ఆ జట్టు యాజమాన్యం రూ.15 కోట్లు చెల్లిస్తుంది. ఈ టోర్నీ రద్దైతే హిట్ మ్యాన్ కూడా రూ.15 కోట్లు నష్టపోతాడు.

ఎంఎస్ ధోని

మిస్టర్ కూల్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్. మూడు సార్లు జట్టును ఐపీఎల్ విజేతగా నిలిపిన ధోనికి ఆజట్టు యాజమాన్యం రూ.15 కోట్లు చెల్లిస్తుంది. అంతేగాకుండా ఈ ఐపీఎల్ ధోని ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్ తో ముడిపడి ఉంది. సో ఐపీఎల్ రద్దైయితే ధోనికి రూ.15 కోట్లు నష్టపోవడమే కాకుండా ధోని క్రికెట్ కెరీర్ ఇక ముగిసినట్లే అని చెప్పవచ్చు.

పాట్ కమిన్స్..

ఆస్ట్రేలియా ఫేసర్ పాట్ కమిన్స్ ను ఈ సారి వేలం కోల్ కతా  నైట్ రైడర్స్ అత్యధిక ధర పెట్టి కొనుక్కుంది. కమిన్స్ కు రూ.15.5 కోట్లు చెల్లిస్తుంది. అయితే తమ దేశం నుంచి ఎవరు వేరే దేశాలకు వెళ్లకూడదని ఆస్ట్రేలియా ఆంక్షలు విధించింది. కాబట్టి కమిన్స్ ఐపీఎల్ కు వచ్చేది డౌటే..ఇదే జరిగితే కమిన్స్ కు రూ.15.5 కోట్లు నష్టం. బెన్ స్టోక్స్ ను రాజస్థాన్ రాయల్స్ 12.5 కోట్లకు కొనుక్కుంది. అత్యధిక ధర పలికిన ఆటగాళ్లలో స్టోక్స్ కూడా ఒక్కడు. ఐపీఎల్ జరగకపోతే స్టోక్స్ కూడా రూ. 12.5 కోట్లు నష్టపోతాడు.