నాగ్ పూర్: పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మరో రికార్డును బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సెకండ్ వన్డేలో సెంచరీతో చెలరేగిన కోహ్లీ..ఆసీస్ కి చెందిన మాజీ క్రికెటర్ రికార్డ్ ను బ్రేక్ చేశాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ వన్డేలో 22 పరుగుల దగ్గర ఈ మైలురాయిని చేరుకున్న కోహ్లీ.. 159 ఇన్నింగ్స్‌ల్లోనే 9వేల పరుగులు చేశాడు.
ఇందుకు పాంటింగ్ 203 ఇన్నింగ్స్‌లు ఆడాల్సి వచ్చింది. 9వేల పరుగులు చేసిన కెప్టెన్లలో గ్రేమ్ స్మిత్(220 ఇన్నింగ్స్‌లు) ఎంఎస్‌ధోని (253), అలెన్ బోర్డర్(257), స్టీఫెన్ ఫ్లెమింగ్ (272) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Virat Kohli. He has made players scoring 30 and less ODI hundreds look mediocre. #INDvAUS pic.twitter.com/3hiZKtfeVc
— MJ Imran (@mjimran) March 5, 2019
