
టీమిండియా కెప్టెన్ వీరాట్ కోహ్లీ, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. ప్రపంచ క్రికెట్లో పరుగుల దాహం తీరడం లేదు. ప్రెజెంట్ వీళ్ల హవా మామూలుగా లేదు. నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడుతున్నారు. 2019 వన్డే ర్యాంకింగ్స్ లో టాప్ 1, టాప్ 2 లో ముగించారంటే వీళ్ల పోటీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది ఇంటర్నేషనల్ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన వారిలో కూడా నంబర్ 1,నంబర్ 2 స్థానాల్లో కోహ్లీ, రోహితే ఉన్నారు.
2019లో వీరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆట తీరు
వీరాట్ కోహ్లీ
- 26 వన్డేలు 1,377 పరుగులు, 8 టెస్టులు 612 పరుగులు, 10 టీ 20లలో 466 పరుగులు చేశాడు. అన్ని ఫార్మాట్లలో కలిసి 2455 పరుగులతో ప్రపంచ నంబర్‌వన్.
- ఈ ఏడాది కోహ్లీ అన్ని ఫార్మాట్లలో కలిసి ఏడు సెంచరీలు చేశాడు. వన్డేలో 5, టెస్టులో 2 సెంచరీలు చేశాడు. ఇందులో టెస్టు కెరియర్‌లోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ 254 నాటౌట్.
రోహిత్ శర్మ
- 28 వన్డేల్లో 1,490 పరుగులు, 5 టెస్టులు 556 పరుగులు, 14 టీ20లలో 396 పరుగులు చేశాడు. అన్ని ఫార్మాట్లలో 2442 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
- ఈ ఏడాది రోహిత్ ఓవరాల్ గా 10 సెంచరీలు చేశాడు. ఐదు సెంచరీలు ప్రపంచకప్‌లో చేసినవే. వన్డేల్లో 7, టెస్టుల్లో మూడు సెంచరీలు. ఇందులో టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 212.