గెలవడంలో ఇండియన్ ఆర్మీనే మాకు స్ఫూర్తి : విరాట్ కోహ్లీ

గెలవడంలో ఇండియన్ ఆర్మీనే మాకు స్ఫూర్తి : విరాట్ కోహ్లీ

వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియా ఇంగ్లండ్ కు బయల్దేరి వెళ్లింది. మే 30 నుంచి ఇంగ్లండ్, వేల్స్ లో ప్రారంభం కానున్న ప్రపంచకప్ టోర్నీకోసం వెళ్తూ… ముంబైలో వీడ్కోలు సమావేశంలో మాట్లాడారు టీమిండియా స్కిప్పర్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ రవిశాస్త్రి.

కెప్టెన్ గా తొలిసారి ప్రపంచకప్ కు కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్ వన్డే ప్రపంచకప్ ఆడడం ఇది మూడోసారి. ఐతే.. తొలిసారి కెప్టెన్ గా టీమ్ ను లీడ్ చేయబోతున్నాడు విరాట్ కోహ్లీ. ప్రపంచకప్ అనేది ఛాలెంజింగ్ టోర్నీ అని కోహ్లీ అన్నాడు. “ఏ టీమ్ అయినా.. మరో టీమ్ ను ఓడించొచ్చు. అప్ సెట్ చేయొచ్చు. పరిస్థితులకు తగ్గట్టుగా తొందరగా వ్యూహం మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ వరల్డ్ కప్ లో తక్కువ స్కోర్లు ఉండొచ్చు.. ఎక్కువ స్కోర్లు ఉండొచ్చు.. అన్ని రకాల స్కోర్లు ఎక్స్ పెక్ట్ చేస్తున్నాం. కొన్ని హై స్కోరింగ్ మ్యాచ్ లు కూడా ఉంటాయనుకుంటున్నాం” అన్నాడు కోహ్లీ.

ఒత్తిడిని తట్టుకోవడమే చాలా ముఖ్యం … దానిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి ఉందన్నాడు విరాట్ కోహ్లీ. “అక్కడి కండిషన్స్ ఎలా ఉంటాయన్నది అంత ప్రాధాన్యత అంశం కాదు. మా బౌలర్స్ అంతా ఇపుడు ఫ్రెష్ గా ఉన్నారు. ఏ ఒక్కరు కూడా అలసటతో లేరు” అన్నాడు విరాట్ కోహ్లీ.

ప్రత్యర్థి జట్టు ఏది అనేది పట్టించుకోకుండా మైదానంలో దిగేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పాడు విరాట్ కోహ్లీ. స్ఫూర్తి, మోటివేషన్ అనేది ఎక్కడినుంచైనా తీసుకోవచ్చని అన్నాడు కోహ్లీ. ఇండియన్ ఆర్మీ గురించి మాట్లాడినట్టయితే.. వారికోసం ఏదైనా చేయొచ్చు. ఈ కప్ ఇండియాకు తీసుకొస్తే అదే మేం ఇచ్చే గొప్ప గిఫ్ట్ అవుతుంది” అన్నాడు విరాట్.