బెంగళూరు: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (61 బాల్స్‌లో 13 ఫోర్లు, 1 సిక్స్‌తో 77).. విజయ్ హజారే ట్రోఫీలో మరోసారి చెలరేగాడు. కెప్టెన్ రిషబ్ పంత్ (79 బాల్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 70) కూడా బ్యాట్ ఝుళిపించడంతో.. శుక్రవారం జరిగిన ఎలైట్ గ్రూప్–డి రెండో మ్యాచ్‌లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గుజరాత్‌పై గెలిచింది. టాస్ ఓడిన ఢిల్లీ 50 ఓవర్లలో 254/9 స్కోరు చేసింది. హర్ష్ త్యాగీ (40) రాణించాడు. విశాల్ జైస్వాల్ 4, రవి బిష్ణోయ్ 2 వికెట్లు తీశారు. తర్వాత గుజరాత్ 47.4 ఓవర్లలో 247 రన్స్‌కు ఆలౌటైంది. ఆర్యా దేశాయ్ (57), సౌరవ్ చౌహాన్ (49), ఉర్విల్ పటేల్ (31), అభిషేక్ దేశాయ్ (26), విశాల్ జైస్వాల్ (26) పోరాడినా ప్రయోజనం దక్కలేదు. కోహ్లీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇక లిస్ట్–ఎ క్రికెట్‌లో అత్యధిక యావరేజ్ (57.87) కలిగిన తొలి క్రికెటర్‌గా కోహ్లీ రికార్డులకెక్కాడు. మైకేల్ బేవాన్ (57.86)ను అధిగమించాడు.
రోహిత్ డకౌట్
జైపూర్: ఉత్తరాఖండ్‌తో జరిగిన ఎలైట్ గ్రూప్–సి మ్యాచ్‌లో రోహిత్ శర్మ (0) గోల్డెన్ డకౌటయ్యాడు. అయినా ముంబై 51 రన్స్ తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడిన ముంబై 50 ఓవర్లలో 331/7 స్కోరు చేసింది. హార్దిక్ తొమరే (93 నాటౌట్), ముషీర్ ఖాన్ (55), సర్ఫరాజ్ ఖాన్ (55), శామ్స్ ములానీ (48) రాణించారు. తర్వాత ఉత్తరాఖండ్ 50 ఓవర్లలో 280/9 స్కోరుకే పరిమితమైంది. యువరాజ్ చౌదరి (96), జగదీశ్ సుచిత్ (51) మెరుగ్గా ఆడారు.
