Cricket World Cup 2023: రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించిన విరాట్ కోహ్లి సోదరి 

Cricket World Cup 2023: రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించిన విరాట్ కోహ్లి సోదరి 

విరాట్ కోహ్లీకి ఒక సోదరి ఉన్న సంగతి బహుశా చాలా మందికి తెలిసి ఉండదు. అతనికి వికాస్ కోహ్లీ అనే ఒక సోదరుడుతో పాటు భావా కోహ్లీ ధింగ్రా అనే ఒక సోదరి కూడా ఉంది. అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో కనిపించని ఆమె తొలిసారి ఇంస్టాగ్రామ్ లో స్పందించింది. అయితే కోహ్లీని కాకుండా టీమిండియా బ్యాటర్ రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించింది. 

వరల్డ్ కప్ లో భాగంగా భారత్-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 84 బంతుల్లో  16 ఫోర్లు 5 సిక్సులతో 130 పరుగులు చేసి మ్యాచుని ఏకపక్షం చేసాడు. ఈ ఇన్నింగ్స్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తుంటే కోహ్లీ సోదరీ భావా  కోహ్లీ ధింగ్రా రోహిత్ ఇన్నింగ్స్ ని “Awsome knock” అని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.   

రోహిత్ శర్మ తన సెంచరీని పూర్తి చేసిన తర్వాత హెల్మెట్‌ని తీసి బ్యాట్‌ను పైకి లేపుతున్న ఫోటోని షేర్ చేసింది. ఈ వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచులో ఆస్ట్రేలియాపై 85 పరుగులు చేసి గొప్ప ఇన్నింగ్స్ ఆడినా కోహ్లీని విష్ చేయని తన సోదరి రోహిత్ ఇన్నింగ్స్ ని అభినందించడం ఆసక్తికరంగా మారింది. కాగా.. ఈ మ్యాచులో రోహిత్ శర్మ పలు రికార్డులు బ్రేక్ చేసాడు. అత్యధిక సిక్సులతో పాటు వరల్డ్ కప్ లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. 31 సెంచరీలతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ని అధిగమించి సచిన్, కోహ్లీ తర్వాతి స్థానాల్లో నిలిచాడు.            

ALSO READ : ఖమ్మంలో ముమ్మర తనిఖీలు.. స్కూటీలో పట్టుబడ్డ భారీ నగదు