ఉప్పల్ స్టేడియంలో SRH, RCB మధ్య జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్ లో బెంగళూరును హైదరాబాద్ మట్టికరిపించిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ మధ్యలో స్టార్ ప్లేయర్స్ కోహ్లీ, హెడ్ మధ్య ఓ చిన్నపాటి యుద్ధమే నడిచింది. మాటల యుద్ధం చివరికి షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోలేని పరిస్థితులకు దారితీసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం కోహ్లీ vs హెడ్ వార్ ఆఫ్ వర్డ్స్ గురించే చర్చ నడుస్తోంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్.. బెంగళూరుకు 256 రన్స్ టార్గెట్ సునాయాస విజయం సాధించింది. అయితే ఛేజింగ్ లో దూకుడు మీదున్న కోహ్లీపై హైదరాబాద్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ స్లెడ్జింగ్ కు దిగాడు. బౌండరీలకు మలచే క్రమంలో కోహ్లీ డిజప్పాయింట్ అవ్వటం చూసి.. భారీ షాట్లు ఆడాల్సిందిగా కామెంట్ చేశాడు. దీంతో కోహ్లీకి మండి.. నువ్వొచ్చి బౌలింగ్ చెయి.. ఆఫ్ స్పిన్ వెయ్.. బౌండరీలు ఎలా ఉంటాయో చూపిస్తా.. అంటూ రిప్లై ఇచ్చాడు. అయినా నువు ఇంపాక్ట్ ప్లేయర్ గానే కదా వస్తావు.. బౌల్ వేసే ఛాన్స్ లేదులే అని వెటకారం చేసినట్లు టాక్. 11 బాల్స్ ఆడిన తర్వాత 15 రన్స్ కే ఔటయ్యాడు. ఆ తర్వాత బెంగళూర్ 55 రన్స్ తేడాతో ఓడిపోయింది.
#ViratKohli 🆚 #TravisHead 🥵🤯
— Star Sports (@StarSportsIndia) May 22, 2026
Tensions rise in high voltage clash🔥#TATAIPL Race to Playoffs 2026 👉 #SRHvRCB | LIVE NOW ➡️https://t.co/52qPTW2gSO pic.twitter.com/JOiWaxNW6T
కోహ్లీ చాలెంజ్ కు తగ్గట్లుగానే ఆ తర్వాత హెడ్ తో కమిన్స్ ఒక ఓవర్ వేయించాడు. ఈ ఓవర్ లో ఊపుమీదున్న పటీదార్ ను ఔట్ చేశాడు హెడ్. మొత్తానికి హైదరాబాద్ ఇచ్చిన టార్గెట్ ను బెంగళూరు ఛేజ్ చేయలేకపోయింది. ఒకవైపు మ్యాచ్ ఓడిపోయిన ఫ్రస్టేషన్, మరోవైపు హెడ్ కెలుక్కోవడంతో.. కోహ్లీ మ్యాచ్ పూర్తయ్యాక తన యాంగర్ ఏంటో చూపించాడు. అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చిన విరాట్.. హెడ్ కు చేయి ఇవ్వకుండా వెళ్లిపోయాడు.
హెడ్ చేయి చాచి షేక్ హ్యాండ్ కు ట్రై చేసినా.. చూడకుండా వెళ్లిపోవటం చూసి హెడ్ షాకయ్యాడు. ఏ మ్యాచ్ అయినా సరదాగా, స్పోర్టివ్ గా ఉండే కోహ్లీ.. గేమ్ స్పిరిట్ కు విరుద్ధంగా వ్యవహరించడంపై కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. మా కింగ్ ను కెలికితే అలాగే ఉంటుంది మరి.. ముందు హెడ్ దే తప్పు అని కోహ్లీ ఫ్యాన్స్ సమర్ధించుకుంటున్నారు. దీనిపై మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించారు. గ్రౌండ్ లో స్లెడ్జింగ్ గొడవలు కామన్.. కానీ పోస్ట్ మ్యాచ్ లో ఫ్రెండ్లీగా ఉండాలని.. షేక్ హ్యాండ్ అవాయిడ్ చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
Virat Kohli didn’t shake hands with Travis Head after the match ended. pic.twitter.com/74UEXm1aUV
— Cricketopia (@CricketopiaCom) May 22, 2026
