సెహ్వాగ్ ట్వీట్: రామాయణంలోని అంగదుడు తనకు ఆదర్శమట..!

సెహ్వాగ్ ట్వీట్: రామాయణంలోని అంగదుడు తనకు ఆదర్శమట..!

టీమిండియా విద్వంసకర ఓపెనర్లలో ఒకరు వీరేంద్ర సెహ్వాగ్. ఈయన ఫాంలో ఉంటే చాలు ప్రత్యర్థి టీం బౌలర్ల పని అంతే… టెస్టులను వండేల్లా ఆడిన ఘనత సేహ్వాగ్‌ది. ఇప్పటికీ కొందరు బౌలర్లకు సేహ్వాగ్ కొట్టిన షాట్లు కలలో వస్తాయంటే అతిశయోక్తి కాదు. సెహ్వాగ్ రిటైర్ అయి బౌలర్లను బతికించారని అంటారు ఆయన అభిమానులు. అయితే సెహ్వాగ్ దేశానికి ఆడుతున్న టైంలో ఆయన ఫుట్ వర్క్ పై చాలా విమర్శలు వచ్చాయి. అసలు ఫుట్ వర్క్ లేకుండా నిల్చున్నచోట అంత భారీ షాట్లు ఎలా కొడతాడో క్రికెట్ విశ్లేషకులకు అర్థం కాలేదు. ఈ విషయంలో సెహ్వగ్ పై ఎన్ని విమర్శలు వచ్చినా తన ఆటతోనే సమాదానం చెప్పాడు తప్ప ఫుట్ వర్క్ ను మార్చుకోలేదు.

ప్రస్తుతం కరోనా వ్యాపిస్తుండటంతో రామాయణాన్ని మళ్ళీ టీవీలో ప్రసారం చేస్తున్నారు. దీంతో తన ఫుట్ వర్క్ ను రామాయణంలోని అంగదుడికి జోడించాడు సెహ్వాగ్. రామాయణంలో అంగదుడు శ్రీరామచంద్రుని దూతగా సంధికోసం రావణ సభకు వెళ్తాడు. అక్కడ తన పాదాన్ని కనుక ఉన్న చోటు నుంచి జరిపితే శ్రీ రాముడు ఓడిపోయినట్లేనని.. దమ్మున్న వాళ్లు తన పాదాన్ని ఉన్నచోటునుంచి అంగులమైనా జరపాలని సవాల్ చేస్తాడు. దీంతో లంకేయులలో కొందరు అంగదుని కాలును జరపడానికి ప్రయత్నించి బంగపడతారు. అయితే అంగదుడే  తన ఫుట్ వర్క్ కు మూలం అని సేహ్వాగ్ ట్వీట్ చేశాడు.