మెరిసిన విశాక ఇండస్ట్రీస్

మెరిసిన విశాక ఇండస్ట్రీస్

క్యూ2 లో రూ. 22.30 కోట్ల లాభం

ఆదాయం రూ. 226.18 కోట్లు

హైదరాబాద్‌‌, వెలుగు: సిమెంట్‌‌ రూఫ్‌‌టాఫ్‌‌లను తయారుచేసే విశాక ఇండస్ట్రీస్‌‌కు సెప్టెంబర్‌‌‌‌తో ముగిసిన క్వార్టర్‌‌‌‌(క్యూ2)లో 22.30 కోట్ల నికర లాభం వచ్చింది. గతేడాది ఇదే క్వార్టర్‌‌‌‌లో ప్రకటించిన రూ. 13.21 కోట్ల కంటే ఈ లాభం 69 శాతం ఎక్కువ. పన్నులకు ముందు లాభం(పీబీటీ) గతేడాది సెప్టెంబర్‌‌‌‌  క్వార్టర్‌‌‌‌(రూ. 6.05 కోట్ల)తో పోలిస్తే ఈ సెప్టెంబర్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌లో 495 శాతం పెరిగి రూ. 29.96 కోట్లకు చేరుకుంది. విశాక ఇండస్ట్రీస్‌‌కు క్యూలో  రూ. 226.18 కోట్ల ఆదాయం వచ్చింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో విశాక ఇండస్ట్రీస్‌‌కు రూ. 511.37 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది ఇదే టైమ్‌‌తో పోలిస్తే ఈ ఆదాయం 12 శాతం తక్కువ. ఈ ఆరు నెలల్లో కంపెనీకి రూ. 76.06 కోట్ల పీబీటీ వచ్చింది. గతేడాది ఇదే టైమ్‌‌లో వచ్చిన రూ. 41.05 కోట్ల పీబీటీ కంటే ఇది 85 శాతం ఎక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో కంపెనీ నికర లాభం 56 శాతం పెరిగి రూ. 56.72 కోట్లకు చేరుకుంది. గతేడాది ఈ లాభం రూ.36.29 కోట్లుగా ఉంది. కంపెనీ బిల్డింగ్‌‌ ప్రొడక్ట్స్‌‌ సెగ్మెంట్‌‌పై కరోనా ప్రభావం తక్కువగా ఉందని విశాక తెలిపింది. రూరల్‌‌ డిమాండ్‌‌ బాగుండడంతో కంపెనీ సిమెంట్‌‌ రేకుల బిజినెస్‌‌ బాగుందని పేర్కొంది. ఖర్చులు తగ్గించుకోవడం, డిజిటలైజేషన్‌‌పై ఎక్కువ దృష్టి పెట్టడంతో కంపెనీ రిజల్ట్స్‌‌ బాగున్నాయని విశాక తెలిపింది. విశాకకు చెందిన వీనెక్స్ట్‌‌, ఆటమ్‌‌లు కూడా కంపెనీ రిజల్ట్స్‌‌పై సానుకూల ప్రభావాన్ని చూపాయని పేర్కొంది. కరోనా దెబ్బతో కంపెనీకి చెందిన సింథటిక్‌‌ దారాల బిజినెస్‌‌ నష్టపోయిందని, ప్రస్తుతం ఈ బిజినెస్ రికవరీ బాటలో ఉందని తెలిపింది.