జనసేన పార్టీకి మరో లీడర్ గుడ్ బై

జనసేన పార్టీకి మరో లీడర్ గుడ్ బై

విశాఖ: జనసేన పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. శనివారం ఆ పార్టీకి చెందిన ఆకుల సత్యనారాయణ రాజీనామా చేయగా.. ఈ రోజు మరో సీనియర్ నాయకుడు ఆ  పార్టీకి గుడ్ బై చెప్పారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిన చింతలపూడి  వెంకటరామయ్య ఆ పార్టీని వీడారు.  త్వరలో ఆయన వైసీపీ తీర్థం తీసుకోనున్నట్టు తెలిసింది. కాగా పార్టీకి రాజీనామా చేసిన  చింతలపూడి వెంకటరామయ్య,  రాజీనామా లేఖను నేరుగా  పవన్ కల్యాణ్  కు పంపారు.

Visakha: senior leader chinthalapudi venkatramaiah quits Janasena party