ఆర్టీసీ సమ్మె: తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశాఖలో ధర్నా

ఆర్టీసీ సమ్మె: తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశాఖలో ధర్నా

ఆర్టీసీ కార్మికులను విధుల్లో చేరనీయకుండా అడ్డుపడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆంధ్ర ప్రదేశ్ విశాఖకు చెందిన ప్రజాసంఘాలు దర్నాకు దిగాయి. ఇందుకు గాను సీఐటీయూ నేతలు తెలంగాణ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. డ్యూటీకి అటెండ్ అవాలని ఆర్టీసీ డిపోకు వెళ్తున్న కార్మికుల అరెస్టులను ఆపేయాలని కోరారు. కార్మికులను వెంటనే విధులలోకి తీసుకోవాలని సీఐటీయూ నేతలు డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు 53రోజులుగా సమ్మె చేస్తున్నా సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని కార్మికుల విషయంలో వ్యతిరేక విధానాలను అవలంభించారని అన్నారు. కోర్టు కార్మికులను బిడ్డల్లా చూసుకోవాలని చెప్పినా… తెలంగాణ ప్రభుత్వం పెడ చెవిన పెట్టిందని… సీఎం ఎప్పటికీ తండ్రి పాత్ర పోషించాలని తెలిపారు. మొండి పట్టుదలకు పోకుండా కార్మికులను అక్కునచేర్చుకోవాలని అన్నారు.