సముద్రంలో చిక్కుకున్న తమిళ మత్స్యకారులు : కాపాడిన విశాఖ కోస్ట్ గార్డ్

సముద్రంలో చిక్కుకున్న తమిళ మత్స్యకారులు : కాపాడిన విశాఖ కోస్ట్ గార్డ్

విశాఖ సముద్ర తీరానికి సమీపంలో తమిళనాడుకు చెందిన మత్స్యకారుల బోటు చిక్కుకుంది. ఇంజిన్ ఫెల్యూర్ కారణంగా 200 నాటికల్ మైల్‌ దూరంలో చిక్కుకుపోయారు జాలర్లు. పది మంది సాయం కోసం ఎదురు చూశారు. బిక్కుబిక్కుమంటూ సముద్రం మధ్యలో తమిళనాడు మత్స్యకారులను విశాఖ కోస్టుగార్డు సిబ్బంది రక్షించారు. వారిని సురక్షితంగా తీరానికి చేర్చారు. 

విశాఖ సముద్ర తీరంలో తమిళనాడు జాలర్లు చేపల వేటకు వెళ్లి చిక్కుకున్నారు.  10 రోజుల క్రితం ( వార్త రాసే రోజుకు)  సముద్రంలోకి వెళ్లిన తమిళనాడు జాలర్ల బోటు ఇంజన్  110 నాటికల్ మైళ్ల దూరంలో  ఫెయిలైంది.  సముద్రం మధ్యలో జాలర్లు నరక యాతన పడ్డారు.  సమాచారం తెలుసుకున్నవిశాఖ కోస్ట్ గార్డ్ తమిళనాడు బోటును రెస్క్యూ చేసి జాలర్లను కాపాడారు.  10 రోజుల నుంచి ఆహారం లేకపోవడంతో వారి ఆరోగ్య పరిస్థితి దారుణంగా ఉంది.  తమిళనాడు జాలర్లకు చెందిన మంజుమాత బోటును రెస్క్యూ చేసిన ఇండియన్ కోస్ట్ గార్డ్  తమిళనాడుకు చెందిన పది మంది జాలర్లను విశాఖ ఫిషింగ్ హార్బర్ కు తరలించారు.