IND vs ENG 2nd Test: కీలకంగా మారనున్న టాస్..వైజాగ్ పిచ్ రిపోర్ట్ ఇదే

IND vs ENG 2nd Test: కీలకంగా మారనున్న టాస్..వైజాగ్ పిచ్ రిపోర్ట్ ఇదే

ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ రెండో టెస్ట్ కు సిద్ధమవుతున్నాయి. వైజాగ్ వేదికగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో రేపు (ఫిబ్రవరి 2) మ్యాచ్ జరగనుంది. తొలి టెస్టులో గెలిచి ఫామ్ లో ఉన్న ఇంగ్లాండ్ అదే ఊపుతో సెకండ్ టెస్టు గెలవాలని భావిస్తుంటే..ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ను ఓడించి కంబ్యాక్ ఇవ్వాలని రోహిత్ సేన భావిస్తుంది. ఈ నేపథ్యంలో వైజాగ్ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. 

సాధారణంగా వైజాగ్ లో స్లో వికెట్ ఉంటుంది. రేపటి మ్యాచ్ లో ఇక్కడ  బ్యాలెన్స్‌డ్ వికెట్ కనిపిస్తుంది. పిచ్ తొలి రెండు రోజుల్లో బ్యాటింగ్ కు అనుకూలిస్తుంది. అయితే మూడో రోజు నుంచి స్పిన్నర్లు ఆటలో కీలక పాత్ర పోషిస్తారు. ఛేజింగ్ కష్టం కనుక టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. తొలి రోజు ఆటలో పేస్ బౌలర్లకు అనుకూలిస్తుంది. 2016లో ఇక్కడ ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టులో భారత్ 246 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. 2019లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో మన జట్టు 203 పరుగుల తేడాతో గెలిచింది.      

ఈ టెస్టులో వర్షం అంతరాయం కలిగించే అవకాశం కనిపించట్లేదు. ఇక్కడ ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 32 డిగ్రీల సెల్సియస్‌ ఉంటుంది. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 9:30 నిమిషాలకు ప్రారంభమవుతుంది.స్పోర్ట్స్ 18. జియో టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 ను ఇప్పటికే ప్రకటించగా.. టీమిండియా ఎలాంటి జట్టుతో బరిలోకి దిగుతుందో ఆసక్తికరంగా మారింది. ఈ సిరీస్ లో భాగంగా హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.